Subhash Goud |
Updated on: Oct 24, 2021 | 1:52 PM
Lenovo Yoga Tab 11: ప్రముఖ స్మార్ట్ ఉత్పత్తుల తయారీ సంస్థ లెనోవో యోగా ట్యాబ్ 11 ట్యాబ్లెట్‌ను (Lenovo Yoga Tab 11) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై పనిచేస్తుంది. ఇది 7,500mAh బ్యాటరీతో వస్తుంది.
టాబ్లెట్‌ని వివిధ కోణాల్లో సెట్చేయడానికి వెనుక భాగంలో ప్రత్యేకమైన మెటల్ స్టాండ్‌ను అమర్చింది. లెనోవో యోగా ట్యాబ్ 11 మీడియాటెక్ హీలియో G90T SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇది 2K రిజల్యూషన్ గల 11-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ట్యాబ్లెట్ ప్రెసిషన్ పెన్ 2 స్టైలస్, గూగుల్ కిడ్స్ స్పేస్‌కు మద్ధతిస్తుంది. జూన్ నెలలోనే యూరప్‌లో విడుదల కాగా, ఆలస్యంగా భారత మార్కెట్లోకి ఇప్పుడు విడుదలైంది.
కొత్త లెనోవో యోగా ట్యాబ్ 11 సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్ గల బేస్ వేరియంట్ రూ. 40,000 ధర వద్ద విడుదలైంది. అయితే అమెజాన్‌లో ప్రారంభపు ఆఫర్ కింద దీన్ని కేవలం రూ. 29,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.