Whatsapp New Feature: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. త్వరలో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో..
Whatsapp New Feature: వాట్సాప్.. ఇది ఉండని స్మార్ట్‌ఫోన్ ఉండదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోనే..
Whatsapp New Feature: వాట్సాప్.. ఇది ఉండని స్మార్ట్‌ఫోన్ ఉండదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లోనే మునిగి తేలుతుంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు వాట్సాప్‌లో చాటింగ్‌లతో ఉండిపోతుంటారు. ఇక కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ సంస్థ కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక త్వరలోనే కొత్త ఫీచర్ రాబోతోందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాట్సాప్‌లో ఇప్పటికే చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా రాబోతున్నది గ్రూప్ చాటింగ్. వాట్సాప్ లో ఇప్పటికే గ్రూప్స్ ఉన్నా, గ్రూప్ చాటింగ్ అందుబాటులో లేదు. త్వరలో కమ్యూనిటీ ఫీచర్ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఎక్స్‌డీఏ డెవలపర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ టెక్నాలజీ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంలలో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్పుడు వాట్సాప్ లో కమ్యూనిటీ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న వారు గ్రూప్ చాటింగ్‌లో పాల్గొనేందుకు వీలవుతుంది.
వాట్సాప్.. ప్రపంచంలో ఎక్కువ మంది వాడుతున్న అతిపెద్ద మెసేజింగ్ యాప్ అని ఎక్స్‌డీఏ తెలిపింది. చాలా మంది యూజర్లు వాడటం వల్ల యాప్ లో కొత్త ఫీచర్లను యాడ్ చేసేందుకు చాలా సమయం పడుతోందని తెలిపింది. వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ ట్యాబ్ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడున్న గ్రూప్స్ డిఫరెంట్‌గా కనిపిస్తాయని టెక్నాలజీ ప్రతినిధులు తెలిపారు. ఎక్స్‌డీఏ టెక్నాలజీ కావాలనుకుంటే ఎలాంటి ఫీచర్లనైనా వాట్సాప్ లో ఎనేబుల్ చేయగలదని చాలా మంది టెక్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
బీటా వెర్షన్‌లో..
ఈ కొత్త ఫీచర్ మనకు వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ v2.21.21.6లో అందుబాటులో ఉంటుంది. ఈ వెర్షన్ కోసం యూజర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కంపెనీ కొత్త ఫీచర్‌తో అప్ డేట్ వెర్షన్ రిలీజ్ చేయగానే వెంటనే డౌన్ లోడ్ చేసుకునేందుకు యూజర్లు సిద్ధంగా ఉన్నారు.
వాట్సాప్ లో కమ్యూనిటీ ఫీచర్ గనుక అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మనం గ్రూప్స్ లో చేస్తున్న మెసేజింగ్ విధానం పూర్తిగా మారే అవకాశం ఉంది.
కమ్యూనిటీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది:
కొత్త అందుబాటులోకి తీసుకువచ్చే ఈ కమ్యూనిటీ ఫీచర్ అచ్చం ఫేస్ బుక్ లో ఉన్న కమ్యూనిటీ ఫీచర్ లాగే ఉండొచ్చని చాలా మంది టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న గ్రూపులకే కమ్యూనిటీ అనే పేరును వాట్సాప్ జోడిస్తుందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఎలా ఉంటుందో ఫీచర్ వస్తే గానీ చెప్పలేం. అందుకే ఫీచర్ కోసం వెయిట్ చేయడం, అంచనాలు వేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి: