AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Beat: గుండె వేగంగా కొట్టుకుంటే పెను ప్రమాదం.. హృదయ స్పందన వేగాన్ని నియంత్రించే బెలూన్ రూపొందించిన పరిశోధకులు!

హృదయ స్పందన పెరుగుదల నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. శాస్త్రీయ భాషలో దీనిని కర్ణిక దడ(Atrial fibrillation) అంటారు. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, అది స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం లేదా శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది.

Heart Beat: గుండె వేగంగా కొట్టుకుంటే పెను ప్రమాదం.. హృదయ స్పందన వేగాన్ని నియంత్రించే బెలూన్ రూపొందించిన పరిశోధకులు!
Heart Beat
KVD Varma
|

Updated on: Oct 27, 2021 | 1:22 PM

Share

Heart Beat: హృదయ స్పందన పెరుగుదల నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. శాస్త్రీయ భాషలో దీనిని కర్ణిక దడ(Atrial fibrillation) అంటారు. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, అది స్ట్రోక్, రక్తం గడ్డకట్టడం లేదా శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ద్రాక్ష ఆకారంలో బెలూన్‌ను రూపొందించారు. క్రమరహిత హృదయ స్పందనలను నియంత్రించడానికి ఈ పరికరం పని చేస్తుంది.

దీనిని యూకే ఆరోగ్య సంస్థ ఎన్‌హెచ్ఎస్(NHS) ఆమోదించింది. గుండె రోగులకు త్వరలో బెలూన్ పరికరాలతో చికిత్స అందించవచ్చు. యూకేలో, 1.4 మిలియన్ల మంది ప్రజలు సక్రమంగా లేని హృదయ స్పందనతో బాధపడుతున్నారు. కొత్త బెలూన్ పరికరం రోగుల చికిత్సలో పెద్ద మార్పును తీసుకురాగలదు.

హృదయ స్పందన ఎందుకు సక్రమంగా ఉండదు?

ఈ కేసులు ఏ వయస్సులోనైనా కనిపిస్తాయి. అయినప్పటికీ, కర్ణిక దడ ఎక్కువగా 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రోగులలో కనిపిస్తాయి. దీనికి చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు, ధమనుల వ్యాధి, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధి, వైరస్ ఇన్ఫెక్షన్, నిద్రలేమి, కెఫిన్-పొగాకు లేదా ఆల్కహాల్ అధిక వినియోగం.

బెలూన్ ఎలా పనిచేస్తుంది

ఈ బెలూన్ 10 రకాల ఎలక్ట్రోడ్లతో అమర్చి ఉంటుంది. రోగికి స్థానిక అనస్థీషియా ఇచ్చిన తర్వాత శస్త్రచికిత్స జరుగుతుంది. శస్త్రచికిత్స సమయంలో, ఈ బెలూన్ ధమని ద్వారా గుండెకు చేర్చడం జరుగుతుంది. ఇది ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని గుండెకు, దెబ్బతిన్న నరాలకు చేరవేస్తుంది. ఈ బెలూన్‌లోని సెన్సార్లు గుండె ఎలక్ట్రికల్ సిగ్నల్‌ను పర్యవేక్షిస్తాయి. బెలూన్ ద్వారా, గుండె చప్పుడు సక్రమంగా మారిన ప్రాంతానికి వేడి పంపిణీ అవుతుంది. ఈ టెక్నిక్ సహాయంతో కేవలం 10 సెకన్లలో గుండె చప్పుడును క్రమబద్ధీకరించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అందుకే ఈ టెక్నిక్ ప్రభావవంతంగా ఉంటుంది..

లండన్‌లోని బార్ట్స్ హార్ట్ సెంటర్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ మాల్కం ఫిన్లే రోగికి లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాతే శస్త్రచికిత్స జరుగుతుందని చెప్పారు. ఇది రోగులలో సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. ఇది కాకుండా, రోగి త్వరగా కోలుకుంటారనీ, ఒక రోజులో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయవచ్చనీ ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఈ టెక్నిక్ చికిత్స పరంగా కూడా చాలా ఖచ్చితమైనదని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: NASA: అంగారకుడిపై తన 14వ మిషన్ విజయవంతంగా పూర్తి చేసిన నాసా ఇంజినిటీ హెలికాప్టర్

Pearl Farming: బకెట్లలో ముత్యాల సాగుబడి.. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి.. ఎలానో తెలుసుకుందాం రండి!

LIC: అధికరాబడి వచ్చే ఇన్సూరెన్స్ పథకం కోసం చూస్తుంటే.. మీకోసమే ఈ ఎల్ఐసీ పాలసీ.. పూర్తి వివరాలివే!