Singer Chitra: సింగర్ చిత్రకు అవార్డు .. షేక్ చేతుల మీదుగా యూఏఈ గోల్డెన్ వీసా..! (వీడియో)
భారతీయ సినీ రంగ ప్రపంచంలో తన గానంతో గాత్రంతో స్పెషల్ ముద్ర వేసిన గాయని కే.ఎస్. చిత్ర. తన స్వరంలో అమృతం నింపుకున్న చిత్ర మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ వంటి అనేక భాషల్లో తన గాత్రంతో అలరించింది.
భారతీయ సినీ రంగ ప్రపంచంలో తన గానంతో గాత్రంతో స్పెషల్ ముద్ర వేసిన గాయని కే.ఎస్. చిత్ర. తన స్వరంలో అమృతం నింపుకున్న చిత్ర మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ వంటి అనేక భాషల్లో తన గాత్రంతో అలరించింది. “దక్షిణ భారత నైటింగేల్” గా ప్రసిద్ధిగాంచిన లెజెండరీ సింగర్ చిత్ర. తన గానంతోనే కాదు.. మాటలతో కూడా మైమరిపిస్తుంది. తాజాగా యుఏఈ గోల్డెన్ వీసా దక్కించుకున్నారు చిత్ర. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నట్టు స్వయంగా చిత్ర సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బుధవారం ఉదయం దుబాయ్ ఇమ్మిగ్రేషన్ చీఫ్ హెచ్‌ఇ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మారి చేతుల మీదుగా యుఎఇ గోల్డెన్ వీసా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని గాయని చిత్ర ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను చిత్ర సోషల్ మీడియాలో చేశారు.
కేరళలోని తిరువనంతపురంలో కృష్ణన్ నాయర్, శాంతకుమారి దంపతులకు 1963లో జూలై 27న చిత్ర జన్మించింది. సంగీతకారుల కుటుంబంలో జన్మించిన చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. కే. ఎస్. చిత్ర గా ఫేమస్ అయ్యింది. బాల్యంలో తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. మాతృభాష మలయాళంలో గాయనిగా గుర్తింపు పొందిన చిత్ర.. యావత్ దక్షిణాది పాటల ప్రేమికులను అలరించింది. 1986లో ‘సింధుభైరవి’ తమిళ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా చిత్ర అవార్డ్ అనుకున్నారు. ‘నఖశతంగల్’, హిందీ చిత్రం ‘విరాసత్’ ద్వారానూ గాయనిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని ‘హ్యాట్రిక్’ సాధించారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులను చిత్ర అందుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో అనేక వేలకు పైగా పాటలు పాడారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

