AP High Court: టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని నియమిస్తారా..? ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
AP High Court on TTD board: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలిని నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి
AP High Court on TTD board: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలిని నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశమివ్వడంతోపాటు.. పలువురిని బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని సభ్యులుగా నియమించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకమండలి సభ్యులుగా నేర చరిత్ర ఉన్న వారిని నియమించారంటూ జీవోను సవాల్ చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. భాను ప్రకాష్ పిటిషన్‌పై న్యాయవాది అశ్విని కుమార్.. ధర్మాసనానికి వాదనలు వినిపించారు. భారత వైద్య మండలి మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ను పాలకమండలి సభ్యుడిగా నియమించడంపై అశ్వినీ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే.. ప్రభుత్వం కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేర చరిత్ర ఉన్నవారిని నియమించారంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు వ్యాఖ్యాలతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
Also Read: