Herbal Tea Benefits: మారుతున్న సీజన్ ప్రకారం.. రోగనిరోధక శక్తి పెరగాలా..? అయితే ఈ హెర్బల్ టీలను తాగండి

Herbal Tea Health Benefits: మారుతున్న సీజన్‌లల్లో.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే.. మంచి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం మీరు ఈ 5 హెర్బల్ టీలను ప్రయత్నిస్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ హెర్బల్ టీలు ఏంటో ఇప్పడు తెలుసుకుందాం.

|

Updated on: Oct 27, 2021 | 11:28 AM

తులసి, అశ్వగంధ టీ : ఈ టీ ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళనను నివారించడానికి సహాయపడుతుంది. తులసి, అశ్వగంధలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే ఓ కప్పు తులసి, అశ్వగంధ టీ తాగడం మంచిది. అలసిపోయినా, నిరసంగా అనిపించిన తులసి అశ్వగంధ టీ తాగితే వెంటనే శక్తి పెరుగుతుంది.

1 / 5
పుదీనా, అల్లం టీ : పుదీనా అల్లం టీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఓ క్లాసిక్ డ్రింక్‌లా పనిచేస్తుంది. పుదీనా టీ శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఈ టీని పాలతో కూడా తాగవచ్చు.

2 / 5
డిటాక్స్ టర్మరిక్ టీ - పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ టీ తయారు చేయడానికి పసుపు, అల్లం, నల్ల మిరియాలు, తేనె, నీరు అవసరం అంతే. ఇది ప్రతిరోజూ తాగితే.. శరీరాన్ని వైరస్ కారకాల నుంచి రక్షించవచ్చు.

3 / 5
తేనె, నిమ్మకాయ, అల్లం టీ : ఇది త్వరగా సులభంగా తయారు చేయగల టీ. సుమారు 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. మీరు మీ రెగ్యులర్ మిల్క్ టీతో.. బోర్ కొడితే.. ఈ టీని ఒకసారి ట్రై చేయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడమే కాకుండా అజీర్తిని కూడా దూరం చేస్తుంది.

4 / 5
అల్లం, అతిమధురం టీ : లైకోరైస్ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. అతిమధురం, అల్లం రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి కూడా సహాయపడతాయి. చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ టీని మీ రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us