Bluefin Tuna Fish: మళ్ళీ కనిపించిన ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..

Bluefin Tuna Fish: సీ ఫుడ్ ఆరోగ్యానికి చాలామంచిది. రొయ్యలు, పీతలు, ఆక్టోపస్, చేపలు ఇలా అనేక రకాల ఆహారాలు ఉన్నా చేపలు ప్రత్యేక వేరు. చేపల ఆహారం..

Bluefin Tuna Fish: మళ్ళీ కనిపించిన ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..
Bluefin Tuna Fish
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2021 | 11:49 AM

Bluefin Tuna Fish: సీ ఫుడ్ ఆరోగ్యానికి చాలామంచిది. రొయ్యలు, పీతలు, ఆక్టోపస్, చేపలు ఇలా అనేక రకాల ఆహారాలు ఉన్నా చేపలు ప్రత్యేక వేరు. చేపల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగాల నుంచి చేప‌లు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. అయితే కొన్ని చేప‌లు రుచితో పాటుగా ఖ‌రీదు కూడా ఎక్కువే.. ప్రపంచంలోని ప్రతి మహాసముద్రాలలో వివిధ జాతుల ట్యూనా చేపలు ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. వీటి రుచి కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో వీటి డిమాండ్ కూడా ఎక్కువ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప.. టూనా.. అయితే, ఈ టూనా చేప‌ల్లో కూడా బ్లూఫిన్ టూనా మరింత ఖరీదైంది. ఈ రకం చేప‌లు అంత‌రించిపోయే జాతి చేప‌లుగా గుర్తించారు. అరుదుగా మాత్రమే కనిపించే ఈ చేపల ధర కూడా అధికమే.. ఈ చేపలను కొన్ని దేశాల్లో వేయడం నిషేధించారు. కొన్ని దేశాల్లో   చేప‌ల వేటకు అనుమతి ఉంది.

2019లో జ‌పాన్‌లోని టోక్యోలో బ్లూఫిన్ టూనా ఫిష్‌ను ప‌ట్టుకున్నారు.  దీని బరువు  278 కిలోలు. ఇది వేలంలో 2.5 మిలియ‌న్ పౌండ్ల ధర పలికింది. అంటే మ‌న దేశ క‌రెన్సీలో రూ. 25 కోట్లకు అమ్ముడుపోయింది.  జపాన్ లో పాపులర్ ఫాస్ట్ ఫుడ్ సంస్థ చైర్మన్ ఈ చేపను కొనుగోలు చేశారు. అయితే తాజాగా బ్లూఫిన్ టూనా చేప యూకేలో క‌నిపించింది. యూకేలోని కార్న్‌వాల్‌లో ఈవ్స్ తీరంలో UKలో ఒక స్వచ్ఛంద సేవకుడు పీటర్ నాసన్ సెయింట్ ఇవ్స్ నేషనల్ కోస్ట్‌వాచ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా చేపను గుర్తించాడు. తన కెమెరాలో ఈ చేపను బంధించాడు.

యూకేలో ఈ చేప‌ను వేటాడ‌టం.. వేలంలో వేయ‌డం నిషేధం. ఒక‌వేళ స‌ముద్రంలో చేప‌లు ప‌డుతుండ‌గా ఆ చేప దొరికినా కూడా దాన్ని స‌ముద్రంలో వ‌దిలేయాలి. ఇదివ‌ర‌కు ఒక‌సారి 270 కిలోల బ‌రువున్న ఈ చేప ఐర్లాండ్ సౌత్ కోస్ట్‌లో ఓ మ‌త్య్సకారుడికి దొరికింది.  అయితే వెంటనే అతను ఆ చేపను తిరిగి స‌ముద్రంలోకి వ‌దిలేశాడు. ఈ జాతి చేప‌లు అంత‌రించి పోతుండ‌టంతో వాటిని కాపాడ‌టం కోసం వాటి వేట‌ను బ్రిటన్ వంటి దేశాల్లో నిషేధించారు. తాజాగా ఈ చేప వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.

Also Read: ఏపీలో గంజాయి వ్యాపారంపై తనకు ఫిర్యాదులు అందాయంటున్న జనసేనాని.. నల్గొండ ఎస్పీ మాటలు పోస్ట్..