Corona Virus: రష్యాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా భారీగా కేసులు నమోదు

Corona Virus: కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. రకరకాల వేరియంట్స్ గా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుతం..

Corona Virus: రష్యాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా భారీగా కేసులు నమోదు
Russia Corona
Follow us

|

Updated on: Oct 27, 2021 | 9:43 AM

Corona Virus: కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. రకరకాల వేరియంట్స్ గా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తుంది.  ప్రస్తుతం యురేపియన్ దేశాలైన రష్యా, బ్రిటన్ లను కోవిడ్ వణికిస్తుంది. రష్యాలో మరింతగా బలపడి.. రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. రష్యాలో రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. ప్ర‌తిరోజూ 30 వేల‌కు పైగా కేసులు, వెయ్యికిపైగా మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి.

గత 24 గంటల్లో ర‌ష్యాలో 36,446 కేసులు న‌మోద‌వ్వగా, రికార్డ్ స్థాయిలో 1106 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు క‌ఠిన‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నా కేసులు త‌గ్గడం లేదు.. ప్రతిరోజూ వెయ్యికిపైగా మ‌ర‌ణాలు సంభ‌విసున్నా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇలా భారీగా మరణాలు నమోదు కావడానికి ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాలు వలెనే అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరోనా కట్టడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 30 నుంచి నవంబర్ 7 వరకూ వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రజ‌లు అత్యవ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు రావొద్దని, వ్యాక్సిన్ త‌ప్పనిస‌రిగా తీసుకోవాల‌ని, మాస్క్ వినియోగించాల‌ని పుతిన్ ప్రభుత్వం ప్రజ‌ల‌ను కోరింది. 60 ఏళ్లు పైబ‌డిన వ్యక్తులు, చిన్నపిల్లలు బ‌య‌ట‌కు రావొద్దని హెచ్చరించింది. రష్యా పరిష్టితిని చూసి.. మిగతా దేశాలు కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మిగతా దేశాలను హెచ్చరిస్తున్నారు.

Also Read:  ఒక్క కాండానికి ఏకంగా 839 చెర్రీ టమాటాలు.. గిన్నిస్ బుక్‌లో చోటు .. ఎక్కడంటే..

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..