Viral Video: వీడికి భూమ్మీద నూకలున్నాయ్‌.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేవి..! వీడియో

Viral Video: వీడికి భూమ్మీద నూకలున్నాయ్‌.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేవి..! వీడియో

Phani CH

|

Updated on: Oct 27, 2021 | 11:10 AM

ప్రమాదాలనేవి ఎప్పుడు, ఏ రకంగా వస్తాయో ఎవరూ ఊహించలేం. అవి ఎదురైనప్పుడు కొందరు లక్కీగా తప్పించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ ట్రక్‌ డ్రైవర్‌ అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రమాదాలనేవి ఎప్పుడు, ఏ రకంగా వస్తాయో ఎవరూ ఊహించలేం. అవి ఎదురైనప్పుడు కొందరు లక్కీగా తప్పించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ ట్రక్‌ డ్రైవర్‌ అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. అయినా, పాపం తన ట్రక్‌ మీద తెచ్చిన కారుతో ముప్పతిప్పలు పడ్డాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోజరిగింది. వివరాల్లోకి వెళితే.. క్యాంపినాస్‌కు చెందిన ఓ డ్రైవర్‌ తన ట్రక్‌పైన ఓ నల్ల కారును తీసుకెళుతున్నాడు. అతను వెళ్తున్న దారిలో ఓ ఎత్తయిన మలుపు ఒకటి వచ్చింది. ట్రక్కు మలుపు తిప్పుతున్న సమయంలో ట్రక్‌ మీద ఉన్న కారు సడన్‌గా కిందపడి డౌన్‌లోకి వెళ్లిపోతోంది. అది గమనించిన ఆ వ్యక్తి ట్రక్‌లోంచి కిందకు దూకి కారు వెంట పరిగెత్తాడు. కారు చివరకు ఓ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. హమ్మయ్యా అనుకున్న డ్రైవర్‌ ట్రక్‌ను తీసుకువచ్చి కారుకు కొద్దిదూరంలో ఆపాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Amazon Prime: అనుకున్నట్టే అయింది.. సినిమా ప్రియులకు షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకనుండి ప్రైమ్‌ ధరలు..?? వీడియో

ఈ పామును పట్టడానికి ఇంగ్లండ్‌ నుంచి వచ్చారట.. ఎందుకో తెలుసా..?? వీడియో

Viral Video:పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు..

Gulf Of Mexico: సముద్ర గర్భంలో ఏలియన్స్ జీవులు.? మరింత పరిశోధనలు చేస్తామంటున్న శాస్త్రజ్ఞులు..

Published on: Oct 27, 2021 09:30 AM