AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook Smartwatch: ఆపిల్ వాచ్‌కు పోటీగా మెటా స్మార్ట్‌వాచ్‌.. ఇందులోని అద్భతమైన ఫీచర్స్ ఇవే..

ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పేరును మెటాగా మార్చారు. అతని కంపెనీ ఇప్పుడు మెటా లేదా మెటా ప్లాట్‌ఫారమ్‌గా మారిపోయింది. కొత్త ప్లాట్‌ఫారమ్..

Facebook Smartwatch: ఆపిల్ వాచ్‌కు పోటీగా మెటా స్మార్ట్‌వాచ్‌.. ఇందులోని అద్భతమైన ఫీచర్స్ ఇవే..
Facebook Smartwatch
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2021 | 3:03 PM

Share

Meta Smartwatch: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పేరును మెటాగా మార్చారు. అతని కంపెనీ ఇప్పుడు మెటా లేదా మెటా ప్లాట్‌ఫారమ్‌గా మారిపోయింది. కొత్త ప్లాట్‌ఫారమ్ కొత్త కంపెనీ బ్రాండ్ క్రింద యాప్‌లు, సాంకేతికతను రెడీ చేసింది. ఇప్పుడు ఆపిల్ వాచ్‌తో పోటీపడే స్మార్ట్‌వాచ్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఒకే కెమెరాను కలిగి ఉండే స్మార్ట్‌వాచ్‌పై మెటా పనిచేస్తోందని తన తాజా నివేదికలో పేర్కొంది.

ఇది కంపెనీ ఇటీవల ప్రారంభించిన రే-బాన్ స్టోరీస్ గ్లాసెస్‌ను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. దీనిని ఫేస్‌బుక్ అని పిలుస్తున్నారు. గ్లాసెస్ వీడియోను రికార్డ్ చేయడానికి ఇంటర్నల్ కెమెరాలను ఉపయోగిస్తుంది. మీరు తక్షణమే Facebook లేదా Instagramలోని రే-బాన్ స్టోరీలను వీడియోలను చూడవచ్చు. కెమెరా ద్వారా Facebook ప్లాట్‌ఫారమ్‌లో వాస్తవంగా ఉండే సామర్థ్యం మెటా స్మార్ట్‌వాచ్‌లో అతిపెద్ద హైలైట్ కానుంది.

Meta స్మార్ట్‌వాచ్‌లో స్క్వేర్ డిస్‌ప్లే.. 

నెట్టింట్లో లీకైన చిత్రం మెటా స్మార్ట్‌వాచ్‌లో ఆపిల్ వాచ్ మాదిరిగానే ఉంది. మెటా స్మార్ట్‌వాచ్  నాచ్‌లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది పని చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు వినియోగదారు ఆటో మోడ్‌లో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. మణికట్టు స్వల్ప కదలికను కూడా ఈ కెమెరా ద్వారా రికార్డ్ చేసుకునే ఛాన్స్ ఉంది. Apple లేదా మరేదైనా స్మార్ట్‌వాచ్ బ్రాండ్ ఇంకా అందించని వీడియో కాల్‌ల కోసం కూడా కెమెరాను ఉపయోగించవచ్చు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఈ కెమెరా స్పెసిఫికేషన్‌ల గురించి ఎక్కడా చెప్పలేదు. అయితే స్మార్ట్‌వాచ్ ధరించేందుకు పట్టీలను కలిగి ఉంటుందని పేర్కొంది.

2022 నాటికి మెటా స్మార్ట్‌వాచ్ విడుదల కానుంది

తాజా నివేదికల ప్రకారం 2022 నాటికి ఈ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు మెటా ప్లాన్ చేస్తోంది. స్మార్ట్‌వాచ్ వచ్చే ఏడాది ప్రారంభించబడవచ్చు. మెటా స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ iOS ఫోన్‌లతో పని చేస్తుంది. అంటే ఇది యాపిల్ వాచ్‌కి పోటీదారుగా ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి.

ఇవి కూడా చదవండి: Facebook – Meta: మారిన ఫేస్‌బుక్ పేరు.. కొత్త పేరు ఇదేనంటూ ప్రకటించిన మార్క్ జూకర్‌బర్గ్..

Mirnalini Ravi: సముద్రపు ఒడ్డున వయ్యారాలు ఒలకబోస్తున్న మృణాళిని రవి.. ఆమె అందాలు చూడతరమా.!