Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPR Treatment: ప్రతి 90 సెకెన్లకూ ఒకరు మృతి.. ఇలా చేస్తే నిండు ప్రాణాలను కాపాడొచ్చు..! (వీడియో)

CPR Treatment: ప్రతి 90 సెకెన్లకూ ఒకరు మృతి.. ఇలా చేస్తే నిండు ప్రాణాలను కాపాడొచ్చు..! (వీడియో)

Anil kumar poka

|

Updated on: Oct 29, 2021 | 6:13 PM

అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను చాలా చూస్తుంటాం. దానికి కారణం.. కార్డియాక్‌ అరెస్ట్‌. ఈ కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా చాలామంది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.


అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను చాలా చూస్తుంటాం. దానికి కారణం.. కార్డియాక్‌ అరెస్ట్‌. ఈ కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా చాలామంది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గుండెపోటుకు గురైన వారికి సత్వరంగా ప్రాథమిక చికిత్స అందించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాథమిక చికిత్సలో అత్యంత కీలకమైనది కార్డియో పల్మనరీ రీససిటేషన్… సీపీఆర్ ట్రీట్‌మెంట్‌. ఇది హృదయ, శ్వాస సంబంధ బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడే వీలుందని గుండె సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వ్యక్తులు కోలుకునే అవకాశాలు క్షణ క్షణానికి తగ్గిపోతాయి. అయితే, కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వ్యక్తులకు వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాల ఎక్కువగా ఉంటాయి. అందుకే గుండెపోటుకు గురైన వ్యక్తికి సత్వరమే సీపీఆర్ చేయాల్సి ఉంటుంది. అయితే కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై ఆస్పత్రికి చేరుకునేలోపు సి.పి.ఆర్‌ ట్రీట్‌మెంట్‌ కేవలం 46 శాతం మందికే అందుతుంది. వారిలోనూ సీపీఆర్ చేసిన తర్వాత కేవలం 12 మంది మాత్రమే ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదిలాఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా 1.7 కోట్ల మంది ప్రజలు గుండె జబ్బులతో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. కార్డియాక్‌ అరెస్టుతో ప్రతి 90 సెకన్లకూ ఒకరు మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్‌ మరణాల కంటే గుండె జబ్బుల మరణాలు ఎక్కువగా నమోదవడం కలకలం రేపుతోంది. ఇక ప్రతి లక్ష మందిలో 4 వేలకు పైగా మరణాలు సడెన్‌ కార్డియాక్‌ అరెస్టు వల్లే సంభవిస్తున్నట్లు భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ మరణాలన్నింట్లో 30 శాతం ఆస్పత్రికి చేరుకున్న తర్వాత సంభవిస్తుండగా.. 70 శాతం మరణాలు ఆస్పత్రికి చేరుకునే లోపు సంభిస్తున్నాయి. అందుకే ప్రతీ ఒక్కరూ సీపీఆర్, ఏఈడీపై అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలకు సీపీఆర్ పట్ల అవగాహన ఉందని, మన దేశంలోనూ ప్రజలకు దీనిపట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)