Matchbox Price: 14 ఏళ్ల తర్వాత పెరుగుతున్న అగ్గిపెట్టె ధరలు.. ఎంతో తెలుసా..? (వీడియో)

ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. పాలు, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు తానేం తక్కువ కాదన్నట్లుగా అగ్గిపెట్టె ధర కూడా రెట్టింపు కానుంది. ఇన్ని రోజుల నుంచి 1 రూపాయికి మాత్రమే దొరికే అగ్గిపెట్టె...

Matchbox Price: 14 ఏళ్ల తర్వాత పెరుగుతున్న అగ్గిపెట్టె ధరలు.. ఎంతో తెలుసా..? (వీడియో)

|

Updated on: Oct 29, 2021 | 6:03 PM


ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. పాలు, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు తానేం తక్కువ కాదన్నట్లుగా అగ్గిపెట్టె ధర కూడా రెట్టింపు కానుంది. ఇన్ని రోజుల నుంచి 1 రూపాయికి మాత్రమే దొరికే అగ్గిపెట్టె ఇకపై 2 రూపాయలకు చేరుకోనుంది. తాజాగా అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించిన ఐదు కీలక సంఘాలు తమిళనాడులోని శివకాశీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో చివరిసారి 14 సంవత్సరాల క్రితం అంటే 2007లో అగ్గిపెట్టె ధర 50 పైసలు ఉండగా, 1 రూపాయికి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు చేరుకుంది.

అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి సరుకుల ధరలు భారీగా పెరగడం వల్లే అగ్గిపెట్ట ధర పెంచక తప్పడం లేదని తయారీదారులు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును తయారీదారులు 270 నుంచి 300 రూపాయలకు విక్రయిస్తుండగా, ఇక నుంచి 430 నుంచి 480 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. దీనికి అదనంగా 12 శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు ఉంటాయని నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి అగ్గి పెట్టెను 2 రూపాయల చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థల సమాఖ్య ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ ప్రకటించింది.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Follow us