Tourist Dog Viral Video: పదేళ్లుగా ఈ కుక్క చేస్తున్న పని చూస్తే ఆశ్చర్యపోతారు..! పబ్లిక్ వాహనాన్నీ వదలదు.. వైరల్ వీడియో..
ఒక టూరిస్ట్ శునకరాజం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా చాలామందికి ప్రయాణాలు.. అదీ ప్రత్యేకమైన స్థలాలను సందర్శించడం అంటే ఇష్టపడతారు. అవకాశం వచ్చినప్పడు అలా వెళ్లి తాము చూడాలనుకున్న ప్రదేశాలను చూసి ఆనందిస్తారు కూడా.
ఒక టూరిస్ట్ శునకరాజం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా చాలామందికి ప్రయాణాలు.. అదీ ప్రత్యేకమైన స్థలాలను సందర్శించడం అంటే ఇష్టపడతారు. అవకాశం వచ్చినప్పడు అలా వెళ్లి తాము చూడాలనుకున్న ప్రదేశాలను చూసి ఆనందిస్తారు కూడా. ఇక్కడ మనం చెప్పుకోబోయే శునకం పేరు బోజీ. ఇది ప్రతిరోజూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు అంటే మెట్రోరైలు, ప్రభుత్వ బస్సులు ఇలా ఏది దొరికితే అది ఎక్కి నగర సంచారం చేయడం సరదా. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో ప్రయాణించే వారందరికీ చిరకాలంగా పరిచయమున్న నేస్తం ఈ బోజీ. గత పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, కనిపించిన బస్సు లేదా లోకల్ ట్రెయిన్ ఎక్కి ఊరంతా బలాదూర్ తిరగడం ఈ శునకరాజం హాబీ. కుక్కకు అంతకన్నా పనేముంటుంది అనుకుంటే మీరు పొరబడినట్లే…
ఇలా రోజూ బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్న బోజీని గమనించిన అధికారులు ఇంతకూ ఇదెక్కడకు వెళుతుందో తెలుసుకుందామని, దాని చెవికి ఒక ట్రాక్ చిప్ అమర్చారు. ఇస్తాంబుల్ నగరంలోని చారిత్రిక కట్టడాలను చూడటానికి ఈ శునకరాజం రోజూ బస్సు, మెట్రో, బోటు సహా ప్రతి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహానాన్నీ పావనం చేస్తోంది. మెట్రోస్టేషన్‌లలోని లిఫ్టులు, ఎస్కలేటర్లను కూడా ఈ జాగిలం మిగిలిన ప్రయాణికులతో కలసి దర్జాగా ఉపయోగించుకోవడం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టక తప్పదు. ఇస్తాంబుల్ జనాలకు పదేళ్లుగా ఈ జాగిలం బాగా అలవాటైపోవడంతో, ఇది ఏ వాహనంలోకి చొరబడినా ఎవరూ దీనిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం లేదు. పైగా, ఇది సుఖంగా కూర్చోవడానికి వీలుగా పక్కకు తప్పుకుని మరీ దారి కూడా ఇస్తున్నారు. సమయానికి సమయం, శ్రమకు శ్రమ ఆదా అవుతుందని కాబోలు ఈ శునకరాజానికి మెట్రో ట్రెయినంటేనే దీనికి కాస్త మక్కువ ఎక్కువ. అందుకే ఎక్కువగా మెట్రోలో ప్రయాణించడానికే ఇది ఇష్టపడుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..