Viral Video: సింహంతో పోరుకు కాలు దువ్విన శునకం.. ఫలితం మాత్రం మీరు ఊహించింది కాదు. వైరల్‌ వీడియో..

Viral Video: బలంతుడికి, బలహీనుడికి జరిగే పోరులో ఎప్పుడైనా బలవంతుడే గెలుస్తాడు. ఇది చరిత్ర, కాలం చెప్పిన సత్యం. కానీ కొన్ని సందర్భాల్లో మొండి ధైర్యంతో బలవంతుడిపై బలహీనుడు కూడా..

Viral Video: సింహంతో పోరుకు కాలు దువ్విన శునకం.. ఫలితం మాత్రం మీరు ఊహించింది కాదు. వైరల్‌ వీడియో..
Viral Video
Follow us

|

Updated on: Oct 30, 2021 | 5:50 AM

Viral Video: బలంతుడికి, బలహీనుడికి జరిగే పోరులో ఎప్పుడైనా బలవంతుడే గెలుస్తాడు. ఇది చరిత్ర, కాలం చెప్పిన సత్యం. కానీ కొన్ని సందర్భాల్లో మొండి ధైర్యంతో బలవంతుడిపై బలహీనుడు కూడా విజయాన్ని సాధించగలరు. ఎదుటి వ్యక్తి మనకంటే బలవంతుడైనా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే కనీసం శత్రువును భయపెట్టియ్యగలం. ఇది మనుషులకు ఎంత వరకు వర్తిస్తుందో తెలియదు కానీ.. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో మాత్రం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ శునకం, సింహంల మధ్య జరిగిన పోరాటం అనూహ్య మలుపు తీసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అదొక అటవీ ప్రాంతం అక్కడికి అనుకోకుండా ఓ కుక్క వెళ్లింది. దీంతో దానికి అక్కడ భయంకర దృశ్యం కనిపించింది. అదే భారీ పరిమాణంలో ఉన్న సింహం. శునకాన్ని చూసిన వెంటనే సింహం గర్జిస్తూ ముందుకు వచ్చింది. అయితే శునకం మాత్రం భయపడి పారిపోలేదు. తన ముందు ఉన్న సింహం తనకంటే బలమైందని తెలిసినా.? అరుస్తూ ముందుక వెళ్లింది. అంతటితో ఆగకుండా సింహంపైనే అటాక్‌ చేయడానికి ప్రయత్నించింది. శునకంపై దాడి చేయడానికి సింహం ప్రయత్నిస్తున్నా.. ఏ మాత్రం తగ్గకుండా ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో సింహానికే జలక్‌ ఇచ్చింది. అనంతరం శునకం మళ్లీ వెనుతిరిగి పోతున్నా.. సింహం మాత్రం అలాగే చూస్తుండి పోయింది కానీ దాడి చేయడానికి రాలేదు.

జాగ్రత్తగా గమనిస్తే ఈ శునకం మనకు ఒక నీతిని చెప్పింది. జీవితంలో మనకు వచ్చే సమస్య ఎంత పెద్దదైనా దాని నుంచి పారిపోకుండా మొండిగా ముందుకు వెళితే విజయం మనదేనని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉంటే ఈ వీడియోను సుశాంత నందా అనే ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘అసలేం జరుగుతోంది.?’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Telangana: తెలంగాణలో పుర కమిషనర్ల బదిలీలు.. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి..

SP Siddharth Kaushal: సినిమాను తలపిస్తున్న సీన్.. వేల మంది రౌడీషీటర్లకు ఎస్పీ డైరెక్ట్ వార్నింగ్..Watch Video

PM Jan Dhan Yojana: ఆసరాగా నిలుస్తున్న జన్‌ ధన్‌ పథకం.. ఇప్పటి వరకు ఎంత మంది ఖాతాలు తీసుకున్నారో తెలుసా..?