Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health Tips: వచ్చేది చలికాలం.. మరి ఏం చేయాలో.. ఏం చేయకూడదో తెలుసా..

చలికాలం అంటే ఎవరికైనా కాస్త భయమే.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంటుంది. చలితో చాలా మందికి జలుబు, శ్వాసకోశ సంబంధింత వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తుంటాయి. మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి...

Winter Health Tips: వచ్చేది చలికాలం.. మరి ఏం చేయాలో.. ఏం చేయకూడదో తెలుసా..
Winter
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 01, 2021 | 10:01 PM

చలికాలం అంటే ఎవరికైనా కాస్త భయమే.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంటుంది. చలితో చాలా మందికి జలుబు, శ్వాసకోశ సంబంధింత వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తుంటాయి. మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.. అవి ఏమిటంటే..

చలికాలంలో చల్లని గాలులు, పొగ మంచులోకి వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్వెట్టర్ వేసుకోవాలి. తల, చెవులు కప్పి ఉంచే విధంగా క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ అందుబాటులో లేకుంటే కర్చిప్ లాంటి చుట్టుకోవాలి. ప్రయాణాలు చేయాల్సి వస్తే బస్సు, కారులో చేయాలి. ద్విచక్ర వాహనంలో వెళ్లడం తగ్గించుకోవాలి. చలికాలంలో పొడి చర్మం ఉన్న వారికి కాస్త సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ సబ్బులకు బదులు గిజరిన్ సబ్బులను వాడాలి. విటమిన్-ఇ ఉండే మాయిశ్చరైజర్లు వాడాలి.

నీరు ఎక్కువగా తీసుకోవాలి. చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుందని చాలామంది నీటిని తాగడం తగ్గిస్తారు. అలా చేయడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంది. చలికాలంలో నిద్ర లేచిన తర్వాత ఒళ్లంతా పట్టేసినట్లు ఉంటుంది. వారు వ్యాయామం చేయడం వల్ల శరీరం హీట్ పెరిగి వెచ్చగా అవుతుంది. రెండు అరచేతులను రుద్దితే కూడా వేడిగా అవుతాయి. చలికాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం మంచిది. సి విటమిన్ ఉన్న పదార్థలు ఎక్కువుగా తీసుకోవాలి. సిట్రస్ జాతికి చెందిన పండ్లు తీసుకోవాలి.

ఈ సీజన్ లో దొరికే నారింజ, యాపిల్, అరటిపండు తినాలి. అలాగే వెల్లులిని ఎక్కువగా తీసుకుంటే మంచింది. చలికాలంలో పదార్థలు త్వరగా చల్లరిపోతాయి. అందుకే ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది. అర్ధరాత్రి వరకు రోడ్లపై తిరగకుండా రాత్రి 10 గంటలకు పడుకోవడం మంచిది. ఈకాలంలో ఎదురయ్యే జుట్టు పొడిబారడం, చిట్లటం, చుండ్రువంటివి రాకుండా జాగ్రత్తపడాలి. హెయిర్‌ డ్రైయ్యర్‌ వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

Read Also.. Rice substitutes : అన్నం బదులు ఇవి తింటే షుగర్ సమస్యలు రావు…! వీడియో