Heart Disease: మీకు రోజు జిమ్‌ చేసే అలవాటు ఉందా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!

Heart Disease: ఈ రోజుల్లో జిమ్‌ చేయడం అనేది యువతకు ఒక ఫ్యాషన్‌గా మారింది. జిమ్‌, జాగింగ్‌, రన్నింగ్‌, వాకింగ్‌, వంటి ఆరోగ్యానికి మంచివే. కాని ఇవి చేసేటప్పుడు..

Heart Disease: మీకు రోజు జిమ్‌ చేసే అలవాటు ఉందా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 30, 2021 | 5:59 PM

Heart Disease: ఈ రోజుల్లో జిమ్‌ చేయడం అనేది యువతకు ఒక ఫ్యాషన్‌గా మారింది. జిమ్‌, జాగింగ్‌, రన్నింగ్‌, వాకింగ్‌, వంటి ఆరోగ్యానికి మంచివే. కాని ఇవి చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.మితిమీరిన వ్యాయామం లేదా సరైన పద్ధతిలో చేయని కసరత్తులు తీవ్ర అనర్థాలకు దారితీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తుల వయసు, ఆరోగ్య నేపథ్యం తదితర అంశాల ఆధారంగానే వ్యాయామం చేయాల్సి ఉంటుందని, అన్ని రకాల వ్యాయామాలు అందరూ చేయడం కూడా సరికాదని సూచిస్తున్నారు. బీపీ (రక్తపోటు), షుగర్‌ (మధుమేహం), మానసిక ఒత్తిడి తదితర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు పరిమితంగానే వ్యాయామం చేయడం మంచిదంటున్నారు.

గుండె సమస్యలున్నవారు..

ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు జిమ్‌ వంటి వ్యాయామాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ శుక్రవారం బెంగళూరులోని తన ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటుకు గురవ్వడం.. అనంతరం ఆస్పత్రిలో మరణించడం వంటి సంఘటనల నేపథ్యంలో.. జిమ్‌ చేయడం వల్ల గుండెపోటు వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండెపై జిమ్‌ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అనే అంశంపై పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.

జిమ్‌ లేదా ఇతర ఏదేని వ్యాయామం చేసినప్పుడు గుండెపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా జిమ్‌, రన్నింగ్‌, జాగింగ్‌ వంటివి చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. అంతేకాకుండా బీపీ కూడా పెరుగుతుంది. జిమ్‌లో మోతాదుకు మించి కసరత్తు చేయడం వల్ల హార్ట్‌బీట్‌ రిథమ్‌ డిస్టబ్‌ అవుతుంది. దీని వల్ల గుండె సమస్యలు తలెత్త ప్రమాదం ఉంది. అందుకే జిమ్‌ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.

ఇలా జిమ్‌ చేస్తూ కుప్పకూలిన ఘటన ఇటీవల బెంగళూరులో మరొకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి జిమ్‌ చేస్తూ అలిసిపోయి మెట్లపై కూర్చున్నాడు. నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే మరణించిట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలా అనుకోని ఘటనలు జరిగినప్పుడు జిమ్‌ సెంటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఎలాంటి పరిస్థితుల్లో జిమ్‌ చేయాలి? చేయకూడని అంశాలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.

వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఆరోగ్యవంతుల్లో సాధారణ హార్ట్‌బీట్‌ అనేది 60 నుంచి 90 మధ్యలో ఉంటుంది. జిమ్‌ లేదా ఇతర వ్యాయామాలు చేసే సమయంలో హార్ట్‌బీట్‌ అనేది పెరుగడం సహజం. ఇలాంటి సమయాల్లో గుండె వేగం అనేది 120 నుంచి 140 వరకు వెళ్తుంది. వ్యాయామం తరువాత 3 నిమిషాల్లో తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. వ్యాయామం చేసినప్పుడు హార్ట్‌బీట్‌ అనేది 140 దాటినా లేక వ్యాయామం తరువాత 3 నిమిషాల్లో హార్ట్‌బీట్‌ సాధారణ స్థాయికి చేరకపోయినా సదరు వ్యక్తికి గుండె సమస్యలున్నట్టు అనుమానించాలి. సామర్థ్ధ్యానికి మించి ఎక్కువ వ్యాయామం చేసినట్లయితే హార్ట్‌బీట్‌ 140 దాటి ఒక్కసారిగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఎలాంటి సమయంలో గుండెపోటు రావచ్చు?

మూములుగా జిమ్‌ చేసే సమయంలో గుండె పోటు రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది హైపర్‌ట్రోఫిక్‌ అబస్ట్రక్టివ్‌ కార్డియోమయోపతి (HOCM). ఇది వంశపారంపర్యంగా ఉండే గుండె జబ్బు. ఈ జబ్బు ఉన్నవారికి 50 ఏళ్ల వయసు వచ్చినా ఎలాంటి లక్షణాలు బయటపడవు. సాధారణ జీవితమే గడుపుతారు. కానీ శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, ఒత్తిడి తీవ్రమైనప్పుడు మాత్రమే లక్షణాలు బయట పడతాయి. ఎక్కువగా జిమ్‌, జాగింగ్‌ వంటి వ్యాయామాలు చేసినప్పుడు హఠాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హెచ్‌ఓసీఎం ఉన్నవారిలో చిన్నతనంలోనే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల అధికంగా పురుషుల్లో కనిస్తుంటుంది. మహిళల్లో చాలా తక్కువ. ఇది కాకుండా ఊబకాయం, హైపర్‌టెన్షన్‌, అన్‌కంట్రోల్‌ డయాబెటిక్‌ వంటి సమస్యలున్న వారికి సైతం వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి వారికి ఎక్కువ ప్రమాదం..

హెచ్‌వోసీఎం, మధుమేహం, ఊబకాయం, బీపీ, ఒత్తిడి సమస్యలు ఉన్న వారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యలున్న వారు తక్కువ స్థాయిలోనే జిమ్‌ లేదా ఇతర వ్యాయామాలు చేయడం మంచిది.

జిమ్‌లలో వెంటిలేషన్‌..

జిమ్‌ సెంటర్లలో వెంటిలేషన్‌ లేకుంటే జిమ్‌ చేయకూడదు. చిన్న చిన్న గదుల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌, రిన్నింగ్‌, జాగింగ్‌ లాంటివి చేసినప్పుడు వదిలే గాలినే తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రక్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరుగుతుంది. అధిక తలనొప్పి రావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

బరువు తగ్గించుకోవడం, వెయిట్‌ గెయిన్‌ కోసం చాలా మంది జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొంత మంది ఫిట్‌నెస్‌ కోసం వెళ్తున్నారు. ఉద్యోగులు, మహిళలు అధిక బరువు, థైరాయిడ్‌ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అమ్మాయిలైతే నడుము చుట్టున్న కొవ్వును తగ్గించుకునేందుకు, యువకులైతే మజిల్స్‌, చెస్ట్‌ పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అందుకే ప్రత్యేక వ్యాయమాలు, ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు.

జిమ్‌ చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు..

► జిమ్‌లో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి.

► జిమ్‌ చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన మేరకు వ్యాయమం చేయాలి.

► ప్రతి జిమ్‌లో తప్పనిసరిగా మెడికల్‌ అడ్వైజర్‌ను ఏర్పాటు చేసుకోవాలి.

► సామర్థ్యానికి మించి వ్యాయమం చేయకపోవడం మంచిది.

► జిమ్‌లలో ఒకే విధమైన వ్యాయమం చేయకుండా రకరకాలుగా చేయడం మంచిది.

► వ్యాయామం చేస్తున్న సమయంలో మాస్క్‌లు ధరించవద్దు.

► జిమ్‌ కోచ్‌ దగ్గరే వ్యాయామాలు నేర్చుకోవాలి.

► జిమ్‌లో అతిగా బరువున్న పరికరాలను ఎత్తకపోవడం మంచిది.

► వాటర్‌ బాటిల్‌, టవల్‌, లెమన్‌ వాటర్‌, కొబ్బరి వాటర్‌, ఓఆర్‌ఎస్‌ వెంట ఉంచుకోవడం మర్చిపోవద్దు.

► జిమ్‌ చేసిన తర్వాత పండ్లు, గుడ్డు తీసుకుంటే ఒంటి, కండరాల నొప్పులు రావు.

► వ్యాయామాలు చేసే ముందు జిమ్‌లో కోచ్‌ సలహాలు, సూచనలు తీసుకోవడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి:

Live Longer: ఇలా చేస్తే ఎక్కువ కాలం బతకవచ్చు.. అధ్యయనం ద్వారా తేల్చిన నిపుణులు..!

Black Coffee: ఆరోగ్యానికి మేలు చేసే ‘బ్లాక్‌ కాఫీ’.. బరువును తగ్గించడంలో కీలక పాత్ర.. ఎలాగంటే..

ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...