Onion: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.. అలా అని అధికంగా తింటే..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఎందుకంటే.. ఉల్లిపాయలు కేవలం వంటలో రుచి మాత్రమే కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా పని చేస్తాయని అంటారు.

Side Effects of Onion Eating: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఎందుకంటే.. ఉల్లిపాయలు కేవలం వంటలో రుచి మాత్రమే కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా పని చేస్తాయని అంటారు. ఇంత మేలు చేసే తల్లి వంటి ఉల్లికి మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఉల్లి లేనిదే ఈ మధ్య మన వంటకం ఫుల్ ఫిల్ కావడం లేదు. ఆహారంలో ఉల్లిని నంజుకుని మరీ తింటారు. ఉల్లిపాయల్లో అనేక ఔషధ గుణాలతోపాటు పోషకాలు కూడా ఉంటాయి. కనుక వీటిని తింటే ఎన్నో లాభాలు. రోజుకు ఒక సాధారణ సైజ్‌లో ఉన్న ఉల్లిపాయను తింటే చాలు.. అంతకు మించి మంచిది కాదంటున్నారు నిపుణులు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ్రంగా కడిగిన తరువాతే..
పచ్చి ఉల్లిపాయలను శుభ్రంగా కడిగిన తరువాతే తినాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. లేదంటే సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది టైఫాయిడ్‌కు కారణం కావచ్చంటున్నారు. కనుక శుభ్రంగా కడిగిన తరువాతే ఉల్లిపాయల ముక్కలను తినడం మంచిది.
మోతాదుకు మించి తీసుకోవడం వల్ల..
పచ్చి ఉల్లిపాయలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు కొందరు న్యూట్రీషన్లు. కొందరికి ఉల్లిపాయలు పడవు.. అలాంటి వారిలో కూడా ఈ విధమైన లక్షణాలు కనిపిస్తాయి.
ఉల్లిపాయలను అధికంగా తింటే..
ఉల్లిపాయలను అధికంగా తింటే గ్యాస్ ట్రబుల్ సమస్య ఏర్పడుతుంది. కొందరికి అపానవాయువు అధికంగా వస్తుంది. కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. కొందరిలో గుండెల్లో మంట కనిపిస్తుంది.
తినడం వల్ల కొందరికి అలర్జీ..
ఉల్లిపాయలను అధికంగా తినడం వల్ల కొందరికి అలర్జీలు వస్తుంది. దీంతో చర్మం, జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతాయి. కనుక ఉల్లిపాయలను మోతాదులో మాత్రమే తినాలి. మోతాదకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..
Surat Sarees: చీరల వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. సూరత్‌లో పెరుగనున్న ధరలు.. ఎంత పెరుగొచ్చంటే..
PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..