PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..
రోమ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. ఆయనను భారత పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు ప్రధాని మోడీ.
రోమ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. ఆయనను భారత పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు ప్రధాని మోడీ. ఇద్దరి మధ్య గంటపాటు సాగిన సమావేశంలో అనేకాంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇటలీలో రెండు రోజుల నుంచి కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో పోప్‌తో సమాశంపై ఉత్కంఠ నెలకొంది. గత 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోడీ కావడం విశేషం. ప్రధాని మోడీ వెంట విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్..జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్ కూడా ఉన్నారు.
ప్రధాని మోడీ ఫారెన్ టూర్ బిజీబిజీగా కొనసాగుతోంది. వాటికన్ సిటీలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. పోప్ ఫ్రాన్సిస్‌తో పాటు వాటికన్ సిటీ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికిన పోప్ ఫ్రాన్సిస్.. ఆలింగనం చేసుకుని అభినందించారు. ఆ తరువాత పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు మోడీ. అంతర్జాతీయ అంశాలపై ఇద్దరి మధ్య గంటపాటు చర్చలు జరిగాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
Had a very warm meeting with Pope Francis. I had the opportunity to discuss a wide range of issues with him and also invited him to visit India. @Pontifex pic.twitter.com/QP0If1uJAC
— Narendra Modi (@narendramodi) October 30, 2021
కరోనా సంక్షోభంపై పోప్ ఫ్రాన్సిస్‌తో కీలక మంతనాలు జరిపారు ప్రధాని మోడీ. కరోనాపై పోరులో భారత్ కృషిని అభినందించారు పోప్ ఫ్రాన్సిస్ . ముఖ్యంగా ప్రపంచదేశాలకు వ్యాక్సిన్లు అందించడంలో భారత్ చేసిన కృషిని పోప్ ఫ్రాన్సిస్ కొనియాడారు. పేదరికంపై పోరులో భారత్ పోరును కూడా అభినందించారు పోప్ ఫ్రాన్సిస్.
గంటసేపు పోప్ ఫ్రాన్సిస్‌తో మంతనాలు జరిపారు ప్రధాని మోడీ. భారత్‌కు రావాలని పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించారు. మోడీ ఆహ్వానంకు పోప్ ఫ్రాన్సిస్ సానుకూలంగా స్పందించారు.
ఇటలీ రాజధాని రోమ్‌లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జీ-20 (G20) సమావేశం జరగనుంది. ఈ జీ20 సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లపై, యూకేలోని గ్లాస్గోలో వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల అధినేతలతో చర్చించబోతున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ఇటలీ, యూకే పర్యటనకు వెళ్లే ముందు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ 31 దాకా రోమ్‌లో, నవంబర్ 1 నుంచి 2 వరకూ యూకే గ్లాస్గోలో పర్యటించనున్నట్లు తెలిపారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా.