Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccine Patches: సూది లేకుండానే కరోనా వ్యాక్సిన్‌.. త్వరలో అందుబాటులోకి రానున్న ప్యాచ్‌లు..!

Vaccine Patches: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌, ఇతర చర్యల వల్ల..

Vaccine Patches: సూది లేకుండానే కరోనా వ్యాక్సిన్‌.. త్వరలో అందుబాటులోకి రానున్న ప్యాచ్‌లు..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Oct 30, 2021 | 5:08 PM

Vaccine Patches: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌, ఇతర చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. దీనికి తోడు కరోనా వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్‌ వంద కోట్లకు చేరుకుంది. దేశంలో పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, మరి కొన్ని వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. కరోనా మమహ్మారిపై కూడా పరిశోధకులు ఎన్నో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇక సూది లేకుండా ప్రభావవంతమైన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పరిశోధకులు. ప్రాణాలను రక్షించే మందులను చర్మానికి ఎలాంటి నొప్పి లేకుండా ప్యాచెస్‌లను రూపొందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే వైద్యం రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధి అని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటివి అందుబాటులోకి వస్తే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడనుంది. సిరంజిలు అంటే భయపడే పిల్లలకు ఈ పాచెస్‌లు ఎంతగానో సహాయపడనున్నాయి. సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం.. సూది లేని వ్యాక్సిన్‌ వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని తేలినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా – యుఎస్‌ బృందం 5 వేల కంటే ఎక్కువ మైక్రోస్కోపిక్‌ స్పైక్‌లతో ఒక చదరపు సెంటీమీటర్‌ను కొలిచే ప్యాచ్‌లను ఉపయోగించింది. ఇది చాలా చిన్నదిగా ఉంటుందని డేవిడ్‌ ముల్లర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ లాండ్‌లోని వైరాలజిస్టు తెలిపింది. అయితే ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చే సాధారణ వ్యాక్సిన్‌ కన్నా ఇది మెరుగ్గా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. త్రీడి పరిజ్ఞానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్యాచెస్‌లాంటిది చర్మానికి అతికించడం ద్వారా నేరుగా మంచి ఫలితాలను రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంజెక్షన్‌ ద్వారా చేతి కండరంలోకి నేరుగా చేరవేసే టీకా కన్నా ఇది ఎన్నో రేట్లు సమర్ధంగాపని చేస్తుందని పేర్కొంటున్నారు. పొడిపూత పూయబడిన ప్యాచ్‌ వ్యాక్సిన్‌ కనీసం 30 రోజులు 25 డిగ్రీల సెల్సియస్‌, ఒక వారం 40 సెల్సీస్‌ వద్ద స్థిరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. సూది రహిత వ్యాక్సిన్స్‌ అందుబాటులోకి వస్తే సూది అంటే భయపడే వారికి ఎంతో ఉపయోగపడనుంది.

ఇవి కూడా చదవండి:

Hyderabad: కొనసాగుతోన్న ఇంటింటికీ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌.. సద్వినియోగం చేసుకోవాలని సీఎస్‌ పిలుపు..

Telangana News: కరోనా కష్టాలు.. ఇంటి యజమాని వేధింపులకు హాస్టల్ ఓనర్ బలి.. రెంట్ కట్టలేక ఆత్మహత్య