Telangana News: కరోనా కష్టాలు.. ఇంటి యజమాని వేధింపులకు హాస్టల్ ఓనర్ బలి.. రెంట్ కట్టలేక ఆత్మహత్య

Telangana Crime News: చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించింది.  ఇంకా చెప్పాలంటే.. మనిషి జీవితం కరోనాకు ముందు..

Telangana News: కరోనా కష్టాలు.. ఇంటి యజమాని వేధింపులకు హాస్టల్ ఓనర్ బలి.. రెంట్ కట్టలేక ఆత్మహత్య
Crime News
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 30, 2021 | 1:27 PM

Telangana Crime News: చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించింది.  ఇంకా చెప్పాలంటే.. మనిషి జీవితం కరోనాకు ముందు కరోనా తర్వాత అన్న చందంగా మారింది.  ఆర్ధిక, సామజిక , పారిశ్రామిక రంగం .. ఇలా ఒకటేమిటి  అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది.  ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు. ప్రయివేట్ ఉద్యోగులకు ఇచ్చిన వర్క్ ఎట్ హోమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చదువుకోసం పట్నం వచ్చిన విద్యార్థులు, స్పెషల్ కోర్టుల కోసం వచ్చే విద్యార్థులు కూడా ఆన్ లైన్ కోర్సుల నేపథ్యంలో ఇంటి వద్దనే ఉండి పోయారు. దీంతో అన్ని ఉపాధి రంగాలతో పాటు.. ప్రయివేట్ వర్కింగ్ హాస్టల్స్ కూడా తీవ్ర ఇబ్బందులకు లోనయ్యాయి.  హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో వర్కింగ్ మెన్స్ , ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఇవన్నీ కరోనాకు ముందు నిత్యం విద్యార్థులు,, ఉద్యోగులు, స్పెషల్ కోర్సుల కోసం వచ్చే విద్యార్థులతో కిటకిటలాడుతూ ఉండేవి. అయితే కరోనా సమయంలో లాక్ డౌన్ విధిస్తూ.. తీసుకున్న చర్యలతో స్టూడెంట్స్ ఇంటికి చేరుకున్నారు. దీంతో చాలా హాస్టల్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ హాస్టల్ యజమాని బిల్డింగ్ రెంటు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి లోని వినాయకనగర్ లో దారుణం జరిగింది. బిల్డింగ్ రెంటు కట్టలేక నారాయణ అనే హాస్టల్ నిర్వాహకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి ఓనర్ తో పాటు కొందరు మనుషులు నారాయణను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. దీంతో నారాయణ ఈరోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడినట్లు  తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో విద్యార్థులు లేక ఇన్నాళ్లు హాస్టల్స్  ఖాళీగా  ఉన్నాయి. ఐతే ఇప్పుడిప్పుడే ఆఫీసులు,  స్టూడెంట్ సెంటర్స్ ఓపెన్ చేస్తుండడంతో.. హాస్టల్స్ వారు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. దీంతో తమకు కొంత సమయం ఇవ్వమని బిల్డింగ్ యజమానిని అడిగినా కనికరించలేదు అని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు కారణమైన ఇంటి యజమాని పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:  : రేపు పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ