Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prostitution: ఇల్లు అద్దెకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొదలు పెట్టేశారు.. చివరికి పోలీసులకు చిక్కారు..

ఓ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత స్టార్ట్ చేశారు. ఓ మహిళను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించడం మొదలు పెట్టారు. కానీ విషయం బయటపడింది. ఆ నోట ఈ నోట పోలీసులకు చేరింది...

Prostitution: ఇల్లు అద్దెకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొదలు పెట్టేశారు.. చివరికి పోలీసులకు చిక్కారు..
Prostitution
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 30, 2021 | 12:13 PM

ఓ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత స్టార్ట్ చేశారు. ఓ మహిళను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించడం మొదలు పెట్టారు. కానీ విషయం బయటపడింది. ఆ నోట ఈ నోట పోలీసులకు చేరింది. సమయం కోసం ఎదురు చూసిన పోలీసులు అదును చూసి వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్‌ 4లో జరిగింది.

బి.రాజు, నూర్‌పాషా కాసింబీ అనే ఇద్దురు వ్యక్తులు కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్‌ 4లో ఎంఐజీ గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. అక్కడికి ఓ మహిళను రప్పించి గుట్టుచప్పుడు కాకుండా విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం ఆకస్మికంగా దాడి చేసి నిర్వహకులు, మహిళతోపాటు శేరిలింగంపల్లికి చెందిన విటుడు కృష్ణారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసినట్లు కేపీహెచ్‎బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

కొద్ది రోజుల క్రితం ఎస్ఆర్‎నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బంగ్లాదేశ్ జాతీయులు వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్‏‎ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బాపునగర్ రోడ్‎లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు బంగ్లాదేశ్ జాతీయలను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వారితోపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మరో వ్యక్తి ఉన్నారు.

అయితే హైదరాబాద్‎లో ఎక్కడో ఓ చోట వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా మారడం లేదు. బయటకు వచ్చి మళ్లీ అదే వృత్తిని ఎంచుకుంటున్నారు. నగరంలో వ్యభిచారంతోపాటు డ్రగ్స్ దందా కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. పోలీసులు నిత్యం ఎదో ఒక చోట గంజాయో లేక కొకైనో లేక ఇతర మత్తు పదార్థలు పట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా నైజిరియాకు చెందిన కొంత మంది చదువుకోవడానికి రాష్ట్రానికి వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also.. Mirzapur: విద్యార్థి పట్ల ప్రిన్సిపల్‌ అమానుషం..అల్లరి చేశాడని బిల్డింగ్‌పై నుంచి వేలాడదీశాడు..