AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirzapur: విద్యార్థి పట్ల ప్రిన్సిపల్‌ అమానుషం..అల్లరి చేశాడని బిల్డింగ్‌పై నుంచి వేలాడదీశాడు..

విద్యార్థులు తప్పులు చేస్తే సర్ది చెప్పి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత గురువులది..

Mirzapur: విద్యార్థి పట్ల ప్రిన్సిపల్‌ అమానుషం..అల్లరి చేశాడని బిల్డింగ్‌పై నుంచి వేలాడదీశాడు..
Basha Shek
|

Updated on: Oct 30, 2021 | 9:04 AM

Share

విద్యార్థులు తప్పులు చేస్తే సర్ది చెప్పి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత గురువులది. అయితే ఈ విషయాన్ని మర్చిపోయి ఇటీవల కొందరు ఉపాధ్యాయులు స్టూడెంట్స్‌ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. క్రమ’శిక్ష’ణ పేరుతో వారిని దారుణంగా హింసిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో చోటు చేసుకుంది. అల్లరి చేస్తున్నాడనే కారణంతో ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌ విద్యార్థిని స్కూల్‌ బిల్టింగ్‌ పైఅంతస్తు నుంచి తలకిందులుగా వేలాడదీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జిల్లా కలెక్టర్‌ దాకా ఈ ఫొటోలు చేరడంతో సదరు ప్రిన్సిపాల్‌ను పోలీసలు అరెస్ట్‌ చేశారు.

కలెక్టర్‌ ఆగ్రహం పోలీసుల వివరాల మేరకు.. మీర్జాపూర్‌ అహ్రౌరా ప్రాంతంలోని సద్భావణ్‌ శిక్షణ్ హైస్కూల్‌లో మధ్యాహ్నం ఓ విద్యార్థి తోటి విద్యార్థితో గొడవపట్టాడు. దీనిపై ఆగ్రహించిన ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ మనోజ్‌ విశ్వకర్మ విద్యార్థిని పాఠశాల బిల్డింగ్ అంతస్తు నుంచి కిందకు తలకిందులుగా వేలాడదీశాడు. దీంతో అతడు భయపడుతూ గట్టిగా కేకలు వేశాడు. తోటి విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వరకు చేరడంతో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీసులు ప్రిన్సిపల్‌ను అరెస్ట్‌ చేశారు. విద్యార్థులు అల్లరి చేస్తే సర్ది చెప్పాలి కానీ…ఇలా దారుణంగా ప్రవర్తించడమేంటి? అని నెటిజన్లు స్కూల్‌ ప్రిన్సిపల్‌పై మండిపడుతున్నారు.

Also Read:

Crime News: భర్తకు వీడియో కాల్ చేసి భార్య అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లడం లేదని ఏం చేసిందంటే..?

Aryan Khan: షారుక్ ఖాన్‌కు మరోసారి నిరాశ.. కొడుకు ఆర్యన్ ఖాన్ మరోరాత్రి జైలులోనే..

Ganja Seized: భాగ్యనగరంలో 110 కిలోల గంజాయి పట్టివేత.. ఏవోబీ నుంచి అరటి లోడ్‌లో తరలిస్తుండగా..

Follow Us
భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి అవమానించాడు..
భోజనం చేస్తుంటే ప్రొడక్షన్ బాయ్ వచ్చి అవమానించాడు..
ఆలోచనలతో కంప్యూటర్‌లో టైప్ చేసే టెక్నాలజీ.. మస్క్ అద్భుతం!
ఆలోచనలతో కంప్యూటర్‌లో టైప్ చేసే టెక్నాలజీ.. మస్క్ అద్భుతం!
ఇక్కడి చీపురు దుమ్ముకూ భారీ డిమాండ్!
ఇక్కడి చీపురు దుమ్ముకూ భారీ డిమాండ్!
ఎముకల బలానికి, నీరసానికి ఒకే ఒక్క ఔషధం.. ఈ పాయసం
ఎముకల బలానికి, నీరసానికి ఒకే ఒక్క ఔషధం.. ఈ పాయసం
వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు.. ఇలా చేస్తే రెండు.. మూడుతో ఆపరు..
వెన్నలా కరిగిపోయే రవ్వ లడ్డు.. ఇలా చేస్తే రెండు.. మూడుతో ఆపరు..
దీపారాధనకు ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఒక్కో నూనెకు..
దీపారాధనకు ఏ నూనె వాడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఒక్కో నూనెకు..
నోట్లో వేస్తే వెన్నలా జారిపోయే కొబ్బరి హల్వా.. 10 నిమిషాల్లో రెడీ
నోట్లో వేస్తే వెన్నలా జారిపోయే కొబ్బరి హల్వా.. 10 నిమిషాల్లో రెడీ
ఒంట్లో వేడిని తరిమికొట్టి.. బాడీని చల్లగా చేసే గారెలు.. పేదింటిలో
ఒంట్లో వేడిని తరిమికొట్టి.. బాడీని చల్లగా చేసే గారెలు.. పేదింటిలో
రోజూ 7 గంటల నిద్ర కూడా ఉండట్లేదా? ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త!
రోజూ 7 గంటల నిద్ర కూడా ఉండట్లేదా? ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త!
బ్లాక్ డ్రెస్‌లో లేడీ సూపర్‌స్టార్ రచ్చ.. 40 దాటినా తగ్గని క్రేజ్
బ్లాక్ డ్రెస్‌లో లేడీ సూపర్‌స్టార్ రచ్చ.. 40 దాటినా తగ్గని క్రేజ్