Ganja Seized: భాగ్యనగరంలో 110 కిలోల గంజాయి పట్టివేత.. ఏవోబీ నుంచి అరటి లోడ్‌లో తరలిస్తుండగా..
Ganja Seized in Hyderabad: గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పోలీసులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి
Ganja Seized in Hyderabad: గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పోలీసులకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రాష్ట్రంలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థులను హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు అరటి లోడ్‌లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పలు వివరాలను వెల్లడించారు.
గంజాయి పట్టుకునేందుకు నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్-ఒడిశా బోర్డర్ (ఏఓబీ) విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నాగ్‌పుర్‌కు రవాణా చేస్తున్న మొత్తం 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.18.50లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అరటి పండ్ల లోడ్‌లో గంజాయి తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు.
Also Read: Crime News: నగ్నంగా కూర్చొమంటాడు.. మూత్రం తాగాలంటాడు.. శాడిస్ట్ భర్త వేధింపులు..