Crime News: నగ్నంగా కూర్చొమంటాడు.. మూత్రం తాగాలంటాడు.. శాడిస్ట్ భర్త వేధింపులు..
Hyderabad Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొంతకాలం మంచిగా ఉన్నాడు.. ఆ తర్వాత అతని అసలు క్యారెక్టర్ బయటకు వచ్చింది.. కులం పేరుతో దూషించడమే
Hyderabad Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కొంతకాలం మంచిగా ఉన్నాడు.. ఆ తర్వాత అతని అసలు క్యారెక్టర్ బయటకు వచ్చింది.. కులం పేరుతో దూషించడమే కాకుండా.. ఆమెను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. అర్ధనగ్నంగా ఉండమనేవాడని.. మూత్రం తాగాలంటూ ఆ మహిళను హింసించేవాడు. అతని వెంట కుటుంబసభ్యులు కూడా జతకలిసి ఆమెను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. చివరకు శాడిస్ట్ భర్త ఆగడాలు, వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ సంఘటన హైదాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట మక్తల్‌కు చెందిన మహిళ రహమత్‌నగర్‌లో నివసిస్తోంది. ఆమె 2016లో ఓ యువకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని రోజుల మంచిగా చూసుకున్న భర్త.. ఆతర్వాత వేధించడం మొదలుపెట్టాడు. గర్భం దాల్చినా గర్భస్రావం చేయించాడు. 2020లో భర్త సోదరుడు, సోదరి, బావ ఆమెను కులం పేరుతో దూషించేవారు. పలుమార్లు పెట్రోల్ పోసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో భర్తకు రూ.1.50 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా వేధింపులు ఆపలేదని తెలిపింది.
తనను.. కులం పేరుతో దూషిస్తూ.. తీవ్రంగా కొట్టేవాడని తెలిపింది. అర్ధనగ్నంగా కూర్చోవాలంటాడని.. మూత్రం తాగాలని బలవంతం చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. శాడిస్ట్ భర్త, అతని కుటుంబసభ్యుల వేధింపులు రోజురోజుకు మరింతగా పెరగడంతో భరించలేని ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: