Aryan Khan: షారుక్ ఖాన్‌కు మరోసారి నిరాశ.. కొడుకు ఆర్యన్ ఖాన్ మరోరాత్రి జైలులోనే..
షారుక్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ జైలు నుంచి కొడుకు ఆర్యన్ ఖాన్ రావడం వాయిదా పడింది. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో..
Mumbai cruise drugs case: షారుక్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ జైలు నుంచి కొడుకు ఆర్యన్ ఖాన్ రావడం వాయిదా పడింది. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ముంబై హైకోర్టు నుంచి బెయిల్ పొందిన ఆర్యన్ ఖాన్ ఈరోజు కూడా జైలు నుంచి విడుదల కావడం లేదు. జైలు అధికారి చెప్పిన వివరాల ప్రకారం విడుదల ఆర్డర్ కాపీ సరైన సమయంలో ఆర్థర్ రెడ్ జైలుకు చేరుకోలేదు. అందుకే అతడిని రేపే విడుదల చేయవచ్చని.. ఆర్యన్ ఖాన్ ఈరోజు కాకుండా శనివారం విడుదల చేస్తారని కొందరు జైలు అధికారులు చెబుతున్నారు. ఆర్థర్‌రోడ్‌లోని జైలుకు సాయంత్రం 5.35 గంటలకు బెయిల్ పత్రాలన్నీ సమర్పిస్తే.. రాత్రి 7 గంటలకల్లా విడుదలయ్యే అవకాశం ఉందని జైలు అధికారులు తెలిపారు. కానీ విడుదల ఉత్తర్వుల కాపీ సకాలంలో జైలుకు చేరలేదు.
Mumbai | Aryan Khan will not be released from the jail today. He will be released tomorrow morning: Arthur Road Jail officials
— ANI (@ANI) October 29, 2021
బాలీవుడ్ స్టార్ షారూఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరో రోజు జైలులో ఉండాల్సి వస్తోంది. హైకోర్టు నుంచి వచ్చిన బెయిల్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ పూర్తయినా.. అధికారుల సిగ్నేచర్ కాకపోవడం, విడుదలకు సమయం పూర్తికావడంతో రేపటికి వాయిదా పడింది. అయితే.. జైల్ నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు, కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. అంతకు ముందు జైలులో ఆర్యన్‌ను తండ్రి షారూఖ్‌ఖాన్, తల్లి గౌరీ ఖాన్‌లు కలుసుకున్నారు. లక్ష రూపాయల షూరిటీ బాండ్స్‌పై జుహీ చావ్లా సంతకం పెట్టింది. డ్రగ్స్ కేసులో 26 రోజులుగా జైల్‌లో ఉన్న ఆర్యన్‌కు నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ తనయుడు ఆర్యన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన ఇవాళ కూడా విడుదల కాలేదు. అంతకు ముందు.. సెషన్స్ కోర్టు రెండుసార్లు బెయిల్ కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించిన ఆర్యన్ తన తరపున వాదించేందుకు దేశంలో నెంబర్‌వన్ లాయర్‌ను రంగం లోకి దింపాడు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఎంట్రీ ఇచ్చాక ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో సీన్ అంతా మారిపోయింది.
ఇవి కూడా చదవండి: Leander Paes – TMC: గోవా రాజకీయాల్లో మరో సంచలనం.. టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ ప్లేయర్
Facebook Smartwatch: ఆపిల్ వాచ్‌కు పోటీగా మెటా స్మార్ట్‌వాచ్.. ఇందులోని అద్భతమైన ఫీచర్స్ ఇవే..