JIOPHONE NEXT: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అందరిలో ఆసక్తి రేపుతున్న జియో ఫోన్‌ వచ్చేస్తోంది.. ఎంట్రీ ధర రూ.1,999.. విడుదల ఎప్పుడంటే..

JIOPHONE NEXT: భారతీయ టెలికమ్యూనికేషన్ దిగ్గజం రిలయన్స్ జియో తన రాబోయే సరసమైన స్మార్ట్‌ఫోన్ 'జియోఫోన్ నెక్స్ట్'..

JIOPHONE NEXT: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అందరిలో ఆసక్తి రేపుతున్న జియో ఫోన్‌ వచ్చేస్తోంది.. ఎంట్రీ ధర రూ.1,999.. విడుదల ఎప్పుడంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Oct 29, 2021 | 8:02 PM

JIOPHONE NEXT: భారతీయ టెలికమ్యూనికేషన్ దిగ్గజం రిలయన్స్ జియో తన రాబోయే సరసమైన స్మార్ట్‌ఫోన్ ‘జియోఫోన్ నెక్స్ట్’ భారతీయ పండుగ దీపావళికి పండగ రోజున అధికారికంగా విడుదల చేస్తున్నట్లుగా జియో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఈ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రిలయన్స్ ఈ ఫోన్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ముందుగా ప్రకటించింది. అయితే.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేసింది. ఫోన్‌ విడుదల సమయంలో రిలయన్స్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై దృష్టి సారించింది. వారు దాని స్పెసిఫికేషన్‌ల గురించి పెద్దగా వెల్లడించలేదు. అయితే, రిలయన్స్ జియోఫోన్ నెక్స్ట్ ఇటీవల గూగుల్ ప్లే కన్సోల్‌లో జాబితా చేయబడింది. స్మార్ట్‌ఫోన్ గురించి చాలా సమాచారాన్ని విడుదల చేసింది. జియో ఫోన్ నెక్స్ట్ గూగుల్, జియో భాగస్వామ్యంతో తయారు చేశారు. జియో ఫోన్ నెక్స్ట్ కోసం గూగుల్ ప్రత్యేకంగా ప్రగతి ఓ‌ఎస్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించింది దీనిని ఆండ్రాయిడ్ ఆధారంగా రూపొందించారు.

ఈ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. దీని అసలు ధర రూ.6,499 ఉండగా, ఈఎంఐ పద్దతుల్లో కొనుగోలు చేయాలంటే ముందుగా రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 18,24 నెలల్లో ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. ఎలాంటి ఈఎంఐ లేకుండా తీసుకోవాలంటే రూ.6,499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌ రిలయన్స్‌ జియో రిటైలర్‌, జియో మార్ట్‌ డిజిటల్‌ రిటైల్ లలో అందుబాటులో ఉండనుంది. క్వాల్‌కామ్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌, టచ్‌ స్ర్కీన్‌ దీని ప్రత్యేకతలు. ఇది భాషా అనువాద ఫీచర్‌ కలిగి ఉంటుంది. దీని వల్ల అవతలి వ్యక్తి ప్రాంతీయ భాషలో చెప్పే సందేశం ఇవతలి వారికి వారి భాషలోనే వినే అవకాశం కలుగుతుంది. మొత్తం 10 భాషలను అనువాదం చేయగల సామర్థ్యం దానికి ఉంటుంది. స్ర్కీన్‌ మీద ఓపెన్‌ అయ్యే ఏ యాప్‌లో సమాచారం అయినా ఇది చదివి వినిపిస్తుంది.

తక్కువ ధరల్లో లభించినా ఎక్కువ ఫీచర్స్‌ను జోడించింది రిలయన్స్‌. ఈ ఫోన్‌లో ఉండే వాయిస్ అసిస్టెంట్ కస్టమర్లకు ఉపయోగపడనుంది. తమకు బాగా తెలిసిన భాషలో ఇంటర్నెట్ నుంచి సులభంగా సమాచారాన్ని, కంటెంట్ ను పొందడంలో సహకరిస్తుంది. అలాగే ఏ స్క్రీన్ పై అయినా సరే, కంటెంట్‌ను బయటకు చదివి వినిపించేందుకు ‘లిజన్’ అనేది వినియోగదారులకు తోడ్పడుతుంది. ‘ట్రాన్స్ లేట్’ అనేది ఏ స్క్రీన్ పై అయినా కూడా తాము ఎంచుకున్న భాషలోకి కంటెంట్ అనువాదం అయ్యేందుకు వినియోగదారులకు తోడ్పడుతుంది.

సులభమైన స్మార్ట్ కెమెరా ఇందులో శక్తివంతమైన కెమెరాతో ఉంటుంది. పోట్రయిడ్ మోడ్ వంటి వివిధ ఫోటోగ్రఫీ మోడ్స్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటోలను చక్కగా తీసేందుకు వీలు కల్పిస్తుంది. తక్కువ కాంతి ఉన్న సమయంలోనూ ఫోటోలను బాగా తీసేందుకు నైట్ మోడ్ వీలు కల్పిస్తుంది.

ఫీచర్స్..

అలాగే జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ఫీచర్స్ పై వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. 5.45 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్, అడ్రినో 306 జీపీయు, 3500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. అలాగే, 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా,13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ తో పాటు ఆండ్రాయిడ్ గో ఓఎస్ నిక్షిప్తమయి ఉంది. ఇంటర్నల్‌ మెమోరీ 32 జీబీ, డ్యూయల్‌ సిమ్‌, మైక్రో యూఎస్‌బీ సదుపాయాలున్నాయి.

జియో విడుదల చేసిన అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి:

Provident Fund: ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 6 కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే బెనిఫిట్‌..!

Health Insurance: గూగుల్‌ పేతో ఎస్‌బీఐ ఒప్పందం.. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఆరోగ్య బీమా పాలసీ..!