Crime News: భర్తకు వీడియో కాల్ చేసి భార్య అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లడం లేదని ఏం చేసిందంటే..?

Married Woman Suicide: భర్త.. తనను ఇంటికి తీసుకెళ్లడం లేదని.. ఓ వివాహిత మనస్తాపం చెందింది. ఈ క్రమంలో భర్తకు వీడియో కాల్ చేసి.. బలవన్మరణానికి పాల్పడింది. భర్త చూస్తుండగానే

Crime News: భర్తకు వీడియో కాల్ చేసి భార్య అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లడం లేదని ఏం చేసిందంటే..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 30, 2021 | 8:40 AM

Married Woman Suicide: భర్త.. తనను ఇంటికి తీసుకెళ్లడం లేదని.. ఓ వివాహిత మనస్తాపం చెందింది. ఈ క్రమంలో భర్తకు వీడియో కాల్ చేసి.. బలవన్మరణానికి పాల్పడింది. భర్త చూస్తుండగానే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా బాబేనాయక్‌ తండాకు చెందిన రమ్యశ్రీకి (22) కర్ణాటక రాష్ట్రంలని చేలూరుకు చెందిన చందునాయక్‌తో రెండేళ్ల కిందట వివాహమైంది. చందునాయక్, రమ్యశ్రీ దంపతులకు 11 నెలల కుమార్తె కూడా ఉంది.

అయితే.. కుటుంబ విషయమై కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇద్దరు కొన్ని రోజుల నుంచి గొడవపడుతున్నారు. దీంతో రమ్యశ్రీ మదనపల్లెలోని ఎస్‌బీఐ కాలనీ ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఎన్ని రోజులున్నా.. భర్త తనను తీసుకెళ్లడం లేదని రమ్యశ్రీ మనస్తాపం చెందింది. ఈ క్రమంలో శుక్రవారం భర్తకు వాట్సప్‌ ద్వారా వీడియో కాల్‌ చేసింది. అనంతరం అతను చూస్తుండగానే రమ్యశ్రీ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన చందునాయక్.. ఈ విషయాన్ని రమ్యశ్రీ తల్లి (అత్త) కమలమ్మకు ఫోన్‌ చేసి చెప్పాడు.

ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా.. రమ్యశ్రీ ఉరికి వేలాడుతూ కనిపించింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారొచ్చి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. అల్లుడి వేధింపుల కారణంగానే కుమార్తె ఉరేసుకుందని కమలమ్మ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

Crime News: నగ్నంగా కూర్చొమంటాడు.. మూత్రం తాగాలంటాడు.. శాడిస్ట్ భర్త వేధింపులు..

Crime News: అంతర్రాష్ట్ర దొంగ స్కెచ్.. మూత్రం వస్తుందని చెప్పి పరారయ్యాడు.. తలపట్టుకుంటున్న పోలీసులు

ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?