AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్తుమందు ఇచ్చి.. రాయితో కొట్టి భర్తను చంపింది! తర్వాత అడవిలో కాల్చి బాడీ మాయం

వివాహేతర సంబంధాన్ని భర్త ప్రశ్నించడంతో భార్య అతడిని మత్తుమందు ఇచ్చి, బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం కుమార్తె, ఆమె ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని యమునా నది తీరంలోని అటవీ ప్రాంతానికి తరలించి దహనం చేసినట్లు తెలుస్తోంది. భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు పెట్టిన నైనా.. మరుసటి రోజే ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. చివరకు..

మత్తుమందు ఇచ్చి.. రాయితో కొట్టి భర్తను చంపింది! తర్వాత అడవిలో కాల్చి బాడీ మాయం
Woman Kills Husband With Stone
Srilakshmi C
|

Updated on: Aug 09, 2026 | 12:58 PM

Share

మథుర, ఆగస్ట్‌ 9: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధాన్ని భర్త ప్రశ్నించడంతో ఓ మహిళ అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుమార్తె, ఆమె ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని అడవిలోకి తరలించి దహనం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మథురకు చెందిన నైనా (40) తన భర్త మనోజ్‌ సోనీ (42)తో కలిసి జీవిస్తోంది. నైనా కుమార్తె భక్తికి విమల్‌ చౌధరి (22) అనే యువకుడితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు మనోజ్‌ గుర్తించాడు. ఈ విషయమై కుమార్తెను మందలించడంతోపాటు భార్యతోనూ మనోజ్‌ గొడవపడ్డాడు.

ఈ క్రమంలోనే నైనా తన భర్తను హత్య చేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా మత్తుమందు కలిపిన పాలను మనోజ్‌కు ఇచ్చినట్లు సమాచారం. అతడు గాఢంగా నిద్రలోకి వెళ్లిన తర్వాత బండరాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం కుమార్తె భక్తి, ఆమె ప్రియుడు విమల్‌ సహాయంతో మృతదేహాన్ని యమునా నది తీరంలోని అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మిస్సింగ్‌ కేసు పెట్టి.. మరుసటి రోజే ఉపసంహరణ

భర్త కనిపించడం లేదంటూ నైనా ఏప్రిల్‌ 21న పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్‌ కేసు నమోదు చేయించింది. అయితే మరుసటి రోజే ఎలాంటి కారణం చెప్పకుండా ఫిర్యాదును ఉపసంహరించుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అల్లుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, కుమార్తె భక్తిలో మాత్రం ఎలాంటి కలవరం కనిపించకపోవడాన్ని ఆమె తండ్రి బ్రజ్‌మోహన్‌ గమనించాడు. దీంతో అనుమానం వచ్చిన ఆయన కుమార్తెను నిలదీశాడు. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వెంటనే బ్రజ్‌మోహన్‌ ఈ విషయాన్ని మనోజ్‌ సోనీ బంధువులతోపాటు పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నైనా, భక్తి, విమల్‌ చౌధరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow Us
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
అరెరే ఇన్నాళ్లు తెలీదే.. మొక్క మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
చేతులతో భోజనం చేస్తున్నారా? చెంచా కంటే ఇది మంచిదా? ఏది బెటర్‌..
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..!
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేస్తే
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
వర్షాకాలంలోనే కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి? అసలు సంగతి ఇదే..
ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఉదయాన్నే వాము నీళ్లు మీరూ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
60 ఏళ్లు ఆదాయం ఇచ్చింది.. ఇప్పుడు అందంతో ఆనందాన్ని ఇస్తోంది!
60 ఏళ్లు ఆదాయం ఇచ్చింది.. ఇప్పుడు అందంతో ఆనందాన్ని ఇస్తోంది!
చిన్న వయసులోనే జుట్టు నెరిస్తే.. మళ్లీ నల్లగా మారే అవకాశం ఉందా..?
చిన్న వయసులోనే జుట్టు నెరిస్తే.. మళ్లీ నల్లగా మారే అవకాశం ఉందా..?
ఏ సినిమా ఫంక్షన్‌కు రాని నయన్ టాక్సిక్ ఈవెంట్‌కు ఎందుకు వచ్చింది?
ఏ సినిమా ఫంక్షన్‌కు రాని నయన్ టాక్సిక్ ఈవెంట్‌కు ఎందుకు వచ్చింది?