AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. మొత్తం 13,706 పోస్టులకు IBPS నోటిఫికేషన్‌!

IBPS RRB 2026లో భాగంగా దేశవ్యాప్తంగా రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌ స్కేల్‌-I, II, III పోస్టులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు..

గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు.. మొత్తం 13,706 పోస్టులకు IBPS నోటిఫికేషన్‌!
IBPS RRB XV Notification
Srilakshmi C
|

Updated on: Sep 01, 2026 | 3:30 PM

Share

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (RRBs) వివిధ ఉద్యోగాల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ RRBs XV (CRP RRBs XV) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 13,706 గ్రూప్‌ ఏ ఆఫీసర్‌, గ్రూప్‌ బి ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఇవాళ్టి (సెప్టెంబర్ 1, 2026) నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

  • ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టుల సంఖ్య: 8,183
  • ఆఫీసర్‌ స్కేల్‌-I (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల సంఖ్య: 4,256
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) పోస్టుల సంఖ్య: 666
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (ఐటీ) పోస్టుల సంఖ్య: 182
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (చార్టర్డ్‌ అకౌంటెంట్‌) పోస్టుల సంఖ్య: 81
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (లా) పోస్టుల సంఖ్య: 46
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (ట్రెజరీ మేనేజర్‌) పోస్టుల సంఖ్య: 18
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) పోస్టుల సంఖ్య: 16
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) పోస్టుల సంఖ్య: 38
  • ఆఫీసర్‌ స్కేల్‌-III (సీనియర్‌ మేనేజర్‌) పోస్టుల సంఖ్య: 220

IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (CA), MBA వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి ఆఫీసర్‌ స్కేల్‌-I (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు, ఆఫీసర్‌ స్కేల్‌-II (మేనేజర్‌) పోస్టులకు 21 నుంచి 32 సంవత్సరాలు, ఆఫీసర్‌ స్కేల్‌ III (సీనియర్‌ మేనేజర్‌) పోస్టులకు 21 నుంచి 40 సంవత్సరాలు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 21, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. పోస్టును బట్టి అభ్యర్థుల ఎంపికలో ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌ పరీక్ష/సింగిల్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితర దశలు ఉంటాయి. ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆఫీసర్‌ పోస్టులకు పోస్టును బట్టి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 1, 2026.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2026.
  • అప్లికేషన్‌ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2026.
  • ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌: నవంబరు 2026
  • ప్రిలిమినరీ పరీక్ష కాల్‌ లెటర్‌: నవంబరు/డిసెంబరు 2026
  • ప్రిలిమినరీ పరీక్ష: నవంబరు/డిసెంబరు 2026
  • ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబరు 2026/జనవరి 2027
  • మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష కాల్‌ లెటర్‌: డిసెంబరు 2026/జనవరి 2027
  • మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష: జనవరి 2027
  • మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష ఫలితాలు: జనవరి 2027
  • ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌: జనవరి 2027
  • ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2027
  • ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: ఫిబ్రవరి/మార్చి 2027

IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us