తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెం ఫ్లైఓవర్‌పై ప్రమాదంలో ఉన్న లారీలను పరిశీలిస్తుండగా కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై దాడి జరిగింది. అనుమానస్పదంగా కనిపించిన నలుగురు యువకులను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, ఇద్దరు యువకులు చాకుతో కానిస్టేబుల్‌ను పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌కు రాజమహేంద్రవరంలో చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.