ఆశపడి వెళ్లారు బకరా అయ్యారు.. రూ.250కే కేజీ మేక మాసం అంటే ఎగేసుకొని పోయారు.. కట్‌చేస్తే..
సోషల్ మీడియాలో కనిపించేవన్ని నిజమేనని గుడ్డిగా నమ్మి వెళ్తే నట్టేట మునగడం ఖాయం. అచ్చం అలాంటి ఘటనే రాజస్థాన్‌లో వెలుగు చూసింది. రూ. 250కే కేజీ మేక మాంసం అంటూ సోషల్ మీడియాలో యాడ్ చూసిన కొందరు వ్యక్తులు కొనేందుకు ఏకంగా రాజస్థాన్ వెళ్లారు. సీన్‌కట్‌చేస్తే వాటిని తీసుకొని వస్తుండగా ఊహించని షాక్ తగిలింది. ఇంతకూ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తక్కువ ధరకే మటన్ విక్రయిస్తున్నారని నమ్మ వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్ చూస్తుండగా ఓ వీడియో వచ్చింది. ఆ వీడియో కిజీ మేక మాంసం కేవలం రూ. 250కే ఇస్తామంటూ యాడ్ వచ్చింది. అయితే తక్కువ ధరకే మేకలు కావాలంటే రాజస్థాన్ రావాల్సి ఉంటుందని ఆ వీడియోలో ఉన్న వ్యక్తి చెప్పడంతో అది నిజమేనని నమ్మిన వ్యక్తి తన ఫ్రెండ్‌కు కూడా ఈ విషయాన్ని చెప్పాడు.
దీంతో ఇద్దరూ కలిసి మేకల కొనుగోలు కోసం స్వయంగా రాజస్థాన్ వెళ్లారు. వీడియోలో చెప్పిన అడ్రస్‌కు వెళ్లి అక్కడ మేకలను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, వారు సరిగ్గా రాజస్థాన్ – మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోకి రాగానే.. అప్పటికే స్కెచ్ వేసిన కేటుగాళ్లు చెక్‌పోస్ట్ పేరుతో తీవ్ర హడావుడి సృష్టించారు.
మీ వాహనాన్ని చెక్ చేయాలంటూ.. ఈ వాహనాలు మార్చాలని వారిని నమ్మించి, మేకలతో ఉన్న వాహనాన్ని అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. దీంతో తాము మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
