నిన్న వెలిగొండ.. రేపు పోలవరం ఎడమ కాలువ
ఒకవైపు దశాబ్దాల కలగా నిలిచిన వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రభుత్వం.. మరోవైపు రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపైనా దృష్టి సారించింది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్‌ను ఆన్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. పోలవరం ఎడమ కాలువలో గోదావరి జలాల ప్రవాహం ప్రారంభం కానుండటంతో.. ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి అవసరాలకు మరో ముఖ్యమైన ముందడుగు పడనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
