AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dabbakaya Pachadi: ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

తెలుగువారి లోగిళ్లలో పచ్చడి లేనిదే భోజనం పూర్తికాదు. అందులోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే పుల్లపుల్లటి 'దబ్బకాయ పచ్చడి' అంటే ప్రాణం ఇచ్చే వారు ఎంతోమంది. జ్వరం వచ్చి నోరు చప్పబడినప్పుడు, అజీర్తిగా ఉన్నప్పుడు లేదా వేసవిలో కమ్మని చద్దన్నం, పెరుగన్నంలోకి దబ్బకాయ ఊరగాయ నంజుకుంటే ఆ తృప్తే వేరు! 

Phani CH
|

Updated on: Sep 21, 2026 | 10:57 PM

Share
కావలసిన పదార్థాలు: దోరగా పండిన రెండు మీడియం సైజు దబ్బకాయలు, 1 టీస్పూన్ పసుపు, అర కప్పు నుండి ముప్పావు కప్పు కల్లుప్పు, 1 కప్పు ఆవకాయ కారం, పావు కిలో పప్పునూనె / వేరుశనగ నూనె, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి

1 / 5
తయారీ విధానం: దబ్బకాయలను శుభ్రంగా కడిగి తడి ఏమాత్రం లేకుండా పొడి గుడ్డతో పూర్తిగా తుడుచుకోవాలి. కాయలను నాలుగు భాగాలుగా కట్ చేసి, లోపల ఉన్న గింజలను చాకు లేదా చేతితో పూర్తిగా ఏరివేయాలి గింజలు ఉంటే పచ్చడి చేదు వస్తుంది. లోపలి తొనలను, తొక్కను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.తడి లేని శుభ్రమైన ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు సీసాలో కట్ చేసిన దబ్బకాయ ముక్కలను వేయాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి డబ్బాను బాగా కుదపాలి చేతులు పెట్టకుండా బాక్స్‌ను షేక్ చేస్తే ఉప్పు ముక్కలన్నింటికీ సమానంగా పడుతుంది.

2 / 5
మూతపెట్టి మూడు రోజుల పాటు పక్కన ఉంచాలి. ప్రతిరోజూ ఉదయం పొడి గరిటెతో లేదా డబ్బాను కుదుపుతూ ముక్కలను కలుపుతుండాలి. మూడు రోజుల తర్వాత దబ్బకాయ ముక్కలు ఉప్పును పీల్చుకుని బాగా ఊరి, కమ్మటి జ్యూస్ బయటకు వస్తుంది. ఎండ ఉన్నట్లయితే ఈ ముక్కలను డబ్బాలోనే ఒక వారం రోజుల పాటు కాసేపు ఎండలో ఉంచితే ముక్క మరింత మెత్తబడుతుంది.

3 / 5
స్టవ్ వెలిగించి బాండీలో పావు కిలో పప్పునూనె నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె పోసి వేడిచేయాలి. నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, నూనెను గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి బాగా మరిగే నూనెలో కారం వేస్తే నల్లగా మాడిపోతుంది. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడి కారం వేసి గరిటెతో బాగా కలపాలి. ఈ నూనె-కారం మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

4 / 5
నూనె పూర్తిగా చల్లారిన తర్వాత, అందులో ముందుగా ఊరబెట్టుకున్న దబ్బకాయ ముక్కలను జ్యూస్‌తో సహా వేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వేయించిన మెంతిపిండి వేసి ముక్కలన్నింటికీ కారం, నూనె పట్టేలా చేత్తో లేదా పొడి గరిటెతో బాగా కలపాలి. ఈ పచ్చడిని పొడి గాజు సీసాలో భద్రపరిచి మూత పెట్టాలి. పచ్చడి పెట్టిన వెంటనే కాకుండా 15 నుండి 20 రోజుల పాటు ఊరిన తర్వాత తింటే చేదు ఏమాత్రం లేకుండా అమృతంలా ఉంటుంది! వేడి అన్నంలో నెయ్యితో లేదా చద్దన్నం, పెరుగన్నంలోకి ఈ దబ్బకాయ ముక్క తింటుంటే ఆ మజానే వేరు

5 / 5
Follow Us