AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైల్స్, మార్బుల్.. ఏది వేయించాలనుకున్నా ముందు ఫ్లోర్ స్క్రీడింగ్ చేయించండి! ఎందుకంటే..?

ఇల్లు నిర్మించేటప్పుడు ఫ్లోరింగ్‌కు ముందు ఫ్లోర్ స్క్రీడింగ్ చేయించడం చాలా ముఖ్యం. సిమెంట్, సన్నని ఇసుక, నీటి మిశ్రమంతో వేసే ఈ పొర నేలను సమతలంగా, బలంగా చేస్తుంది. స్లాబ్‌లోని ఎగుడుదిగుడులను సరిచేయడంతో పాటు పైపులు, కేబుల్స్‌ను కప్పేందుకు కూడా ఉపయోగపడుతుంది.

టైల్స్, మార్బుల్.. ఏది వేయించాలనుకున్నా ముందు ఫ్లోర్ స్క్రీడింగ్ చేయించండి! ఎందుకంటే..?
What Is Floor Screeding
SN Pasha
|

Updated on: Sep 01, 2026 | 2:51 PM

Share

ఇల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఇంటి నిర్మాణంలో పునాది నుంచి ఫ్లోరింగ్ వరకు ప్రతి దశను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి అందం, మన్నిక, నేల బలానికి ఫ్లోరింగ్ ఎంతో కీలకం. అయితే టైల్స్, మార్బుల్ లేదా ఇతర ఫ్లోరింగ్ మెటీరియల్స్ వేయడానికి ముందు మరో ముఖ్యమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే ఫ్లోర్ స్క్రీడింగ్.

ఫ్లోర్ స్క్రీడింగ్ అంటే కాంక్రీట్ ఫ్లోర్ లేదా స్లాబ్‌పై సిమెంట్, సన్నని ఇసుక, నీటితో తయారు చేసిన మిశ్రమాన్ని ఒక పొరగా వేయడం. దీని ప్రధాన ఉద్దేశం నేలను పూర్తిగా సమతలంగా, స్మూత్‌గా తయారు చేయడం. ఫ్లోర్ స్క్రీడింగ్ పూర్తయిన తర్వాతే టైల్స్, మార్బుల్, చెక్క ఫ్లోరింగ్, కార్పెట్ లేదా ఎపాక్స్ ఫ్లోరింగ్ వంటి వాటిని అమర్చడం సులభంగా ఉంటుంది. ఇంటి నిర్మాణ సమయంలో కాంక్రీట్ స్లాబ్‌పై చిన్నచిన్న ఎగుడుదిగుడులు, లోపాలు ఉండే అవకాశం ఉంటుంది. నేరుగా టైల్స్ లేదా మార్బుల్ వేస్తే ఈ అసమానతలు ఫ్లోరింగ్‌పై ప్రభావం చూపవచ్చు.

దీంతో టైల్స్ సరిగ్గా అమరడం, ఉపరితలం సమంగా ఉండటం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఫ్లోర్ స్క్రీడింగ్ ఈ లోపాలను సరిచేసి ఒక సమతల ఉపరితలాన్ని అందిస్తుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. నేల కింద పాతిపెట్టే ప్లంబింగ్ పైపులు, కొన్ని విద్యుత్ కేబుల్స్ వంటి వాటిని సురక్షితంగా కప్పి ఉంచడంలో స్క్రీడింగ్ సహాయపడుతుంది. దీంతో ఫైనల్ ఫ్లోరింగ్ వేయడానికి ముందు అవసరమైన స్థిరమైన బేస్ సిద్ధమవుతుంది.

ఫ్లోర్ స్క్రీడింగ్ నేల ఉపరితలానికి అదనపు బలం, మన్నికను అందించడంలో కూడా ఉపయోగపడుతుంది. సరైన నిష్పత్తిలో సిమెంట్, సన్నని ఇసుక, నీటిని కలిపి స్క్రీడింగ్ తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మరింత బలం, పనితీరు కోసం పాలిమర్ వంటి ప్రత్యేక పదార్థాలను కూడా మిశ్రమంలో ఉపయోగిస్తారు. అయితే ఫ్లోర్ స్క్రీడింగ్ నాణ్యత పూర్తిగా ఉపయోగించే మెటీరియల్స్, మిశ్రమ నిష్పత్తి, పొర మందం, క్యూరింగ్, పనితనం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిపుణుల సూచనలతో సరైన విధానంలో స్క్రీడింగ్ చేయించడం ముఖ్యం.

Follow Us
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
ఇంట్లో రుద్రాక్ష ఉంచితే వాస్తు దోషాలు మాయం! అదృష్టం, శాంతి కోసం
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
బిగ్ బాస్ ఛాన్స్ మిస్.. రాజకుమారి మరో సంచలన వీడియో
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
పుదీనా-దాల్చినచెక్క టీతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా?
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు..పట్టిందల్లా బంగారమే!
ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..
ఇప్పుడు చూస్తారు తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో..
సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!
సూపర్‌ఫుడ్‌లకే సవాల్ విసిరే అద్భుతమైన ఆకుకూర‌..ఆరోగ్యానికి నిధి!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
బిగ్ బాస్ వల్ల పేరు వస్తుంది.. కానీ సినిమా అవకాశాలు రావు..!
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు..OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
కారు పార్క్ చేసేటప్పుడు టైర్లు సూటిగా ఉంచాలా? తిప్పి ఉంచాలా?
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి
బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి