ఇంటర్ మార్కులతో నేరుగా అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. సెప్టెంబరు 10 వరకే ఛాన్స్!
జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 10, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు..

తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని ఆమనగల్, చేవెళ్ల, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 125 అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 10, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది..
ప్రాజెక్టుల వారీగా పోస్టుల వివరాలు
- ఆమనగల్‌లో పోస్టులు: 31
- చేవెళ్లలో పోస్టులు: 29
- హయత్‌నగర్‌లో పోస్టులు: 3
- ఇబ్రహీంపట్నంలో పోస్టులు: 21
- మహేశ్వరంలో పోస్టులు: 10
- శేరిలింగంపల్లిలో పోస్టులు: 5
- షాద్‌నగర్‌లో పోస్టులు: 26
రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతను ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, విధులు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తూ ఉండాలి. అభ్యర్థులు సంబంధిత తహసిల్దార్ ధ్రువీకరించిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీకి ముందు ఒక సంవత్సరంలోపు జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
అలాగే పోస్టుకు నిర్దేశించిన రోస్టర్ పాయింట్/కులానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆయా పోస్టులకు అర్హులు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 10, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ చేపడుతుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి 10 మార్కులు కేటాయిస్తారు. ఎంపికలో విద్యార్హత మార్కులకు కూడా వెయిటేజీ ఉంటుంది. ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. అదనంగా వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది. వీటితో పాటు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేపడతారు. అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని సెప్టెంబరు 10లోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది.
రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




