ఇది మీకు తెలుసా...? మీరు నిద్రించే పరుపు ఎన్ని సంవత్సరాలకు మార్చాలి?

September 1, 2026

Subhash

 కొత్త టైర్ కొనుగోలు చేసినప్పుడు దాని ట్రెడ్, సైడ్‌వాల్‌పై చిన్న చిన్న రబ్బర్‌ ముళ్లను గమనించారా? అసలు వీటి వెనుక కారణం ఏంటో తెలుసా?

కొత్త టైర్

టైర్‌పై కనిపించే ఈ చిన్న రబ్బర్‌ ముళ్లను ‘వెంట్ స్ప్యూజ్‌’ (Vent Spews) అని పిలుస్తారు. ఇవి టైర్ తయారీ ప్రక్రియలో సహజంగానే ఏర్పడతాయి.

వీటిని ఏమంటారు?

చాలామంది ఈ రబ్బర్‌ ముళ్లు టైర్‌కు మంచి గ్రిప్, ట్రాక్షన్ అందించేందుకు ఉంటాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వీటికి టైర్ పనితీరుతో ప్రత్యక్ష సంబంధం ఉండదు.

గ్రిప్ కోసం కాదు

టైర్ తయారీలో ముడి రబ్బర్‌ను ప్రత్యేకమైన మోల్డ్‌లో ఉంచుతారు. ఆ తర్వాత వేడి, ఒత్తిడితో కూడిన వల్కనైజేషన్ ప్రక్రియ ద్వారా టైర్‌కు తుది ఆకారం ఇస్తారు. 

టైర్ ఎలా తయారవుతుంది?

టైర్‌ను మోల్డ్‌లో తయారు చేసేటప్పుడు రబ్బర్‌, మోల్డ్ మధ్య గాలి చిక్కుకుంటే టైర్ ఉపరితలంలో లోపాలు రావచ్చు. అందుకే మోల్డ్‌లో చిన్న చిన్న వెంట్ హోల్స్‌ ఏర్పాటు చేస్తారు.

గాలి బయటకు వెళ్లేందుకు

వేడి, మెత్తగా ఉన్న రబ్బర్‌ను మోల్డ్‌లోకి ఒత్తినప్పుడు కొంత రబ్బర్‌ ఈ చిన్న రంధ్రాల్లోకి వెళ్తుంది. టైర్ తయారైన తర్వాత అదే రబ్బర్‌ గట్టిపడి చిన్న ముళ్లలా కనిపిస్తుంది.

రబ్బర్‌ ముళ్లు

ఈ చిన్న స్ప్యూజ్‌లు ఉండటం వల్ల తయారీ సమయంలో మోల్డ్‌లోని గాలి బయటకు వెళ్లిందని, టైర్ ఉపరితలం సరిగ్గా ఏర్పడిందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవి తయారీ ప్రక్రియకు సంబంధించిన గుర్తులు.

టైర్‌

టైర్ ట్రెడ్‌పై ఉన్న రబ్బర్‌ ముళ్లు రోడ్డుతో రాపిడి వల్ల కొంతకాలానికే మాయమవుతాయి. సైడ్‌వాల్‌పై ఉన్నవి ఎక్కువకాలం కనిపించవచ్చు. కొత్త టైర్‌పై ఈ ముళ్లు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు.

ఎంతకాలం ఉంటాయి?