AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిలిండర్‌లో ఇంకెంత గ్యాస్ ఉంది.. ఈ సింపుల్ ట్రిక్‌తో సెకన్లలో తెలుసుకోండి..

సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారా? గ్యాస్ సిలిండర్ బరువును చేతులతో ఎత్తకుండానే లోపల ఇంకా ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవచ్చని మీకు తెలుసా? సైన్స్ ఆధారంగా పనిచేసే ఈ సింపుల్ ట్రిక్‌కు కావాల్సిందల్లా ఒక మగ్గు గోరువెచ్చని నీరు మాత్రమే. వంట మధ్యలో పొయ్యి ఆగిపోయే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఆ ఉపాయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుదాం..

సిలిండర్‌లో ఇంకెంత గ్యాస్ ఉంది.. ఈ సింపుల్ ట్రిక్‌తో సెకన్లలో తెలుసుకోండి..
How To Check Lpg Cylinder Gas Level
Krishna S
|

Updated on: Sep 01, 2026 | 3:12 PM

Share

వంట చేస్తున్న సమయంలో హఠాత్తుగా గ్యాస్ అయిపోతే ఎక్కడలేని చికాకు రావడం కామన్. ఈ ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే సిలిండర్‌లో ఇంకెంత గ్యాస్ మిగిలి ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం. అయితే సాధారణంగా చాలామంది గ్యాస్ స్థాయిని అంచనా వేయడానికి బరువైన సిలిండర్‌ను పైకి లేపడం, చేతులతో అటూఇటూ ఊపి చూడటం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన నడుము నొప్పులు, చేతి నరాల సమస్యలతో పాటు సిలిండర్ కిందపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శ్రమ, భయం లేకుండా.. ఎలాంటి ఖరీదైన పరికరాలు కొనాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో ఉండే కేవలం ఒక మగ్గు గోరువెచ్చని నీటితో సిలిండర్‌లో మిగిలిన గ్యాస్ స్థాయిని క్షణాల్లో కచ్చితంగా గుర్తించవచ్చు.

ఈ పరీక్ష ఎలా చేయాలి?

గోరువెచ్చని నీరు సిద్ధం చేసుకోండి: ఒక జగ్గు లేదా మగ్గులో కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకోండి.

నీటిని పోయండి: సిలిండర్ ఒక వైపున పై భాగం నుండి కిందికి నీరు జారేలా నెమ్మదిగా పోయండి.

కొద్దిసేపు ఆగండి: నీరు పోసిన తర్వాత 5 నుండి 10 సెకన్ల పాటు వేచి ఉండండి.

చేతితో తాకి చూడండి: నీరు పోసిన ప్రదేశాన్ని పై నుండి కిందికి వేళ్లతో నిదానంగా తడిమి చూడండి.

గ్యాస్ స్థాయిని ఎలా గుర్తించాలి?

చల్లగా అనిపించే భాగం: మీరు తాకుతున్నప్పుడు ఏ స్థాయి వద్ద ఉపరితలం వెచ్చదనం కోల్పోయి చల్లగా మారుతుందో, ఆ ఎత్తు వరకు లోపల ద్రవరూప గ్యాస్ ఉందని అర్థం.

వెచ్చగా ఉండే భాగం: సిలిండర్‌లో ఖాళీగా ఉన్న భాగం నీటి వేడిని నిలుపుకొని వెచ్చగానే ఉంటుంది.

సిలిండర్ మొత్తం వేడిగా ఉంటే: పై నుండి కింది వరకు ఎక్కడా చల్లదనం కనిపించకపోతే, గ్యాస్ దాదాపు అడుగు భాగానికి చేరుకుందని లేదా పూర్తిగా అయిపోయిందని స్పష్టం. వెంటనే కొత్త సిలిండర్ బుక్ చేసుకోవడం మంచిది.

తేమ గీత: కొన్నిసార్లు ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల ద్రవ గ్యాస్ ఉన్న మట్టం వద్ద సిలిండర్ బయట సహజంగానే తేమతో కూడిన ఒక స్పష్టమైన గీత లేదా నీటి చుక్కలు ఏర్పడతాయి.

దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?

సిలిండర్ లోపల ఎల్పీజీ అధిక పీడనం వల్ల ద్రవ రూపంలో నిల్వ ఉంటుంది. ఈ ద్రవం సిలిండర్ బయటి నుంచి వేడిని చాలా వేగంగా గ్రహిస్తుంది. ఫలితంగా ద్రవ గ్యాస్ ఉన్న భాగం వెంటనే చల్లబడుతుంది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో వేడిని వేగంగా గ్రహించే ద్రవం లేకపోవడంతో ఆ ప్రాంతం వెచ్చగా నిలిచి ఉంటుంది. వంట పూర్తయిన వెంటనే ఈ పరీక్ష చేస్తే, లోపలి ద్రవం అప్పటికే వేడిని గ్రహించే ప్రక్రియలో ఉండటం వల్ల ఫలితం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి