AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?

విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?

Phani CH
|

Updated on: Sep 01, 2026 | 6:35 PM

Share

భార్యాభర్తలు విడాకులు తీసుకున్నంత మాత్రాన ఉమ్మడి హోమ్‌లోన్ బాధ్యతలు తొలగిపోవు. బ్యాంకు రుణ ఒప్పందం కొనసాగుతుండటంతో సహ రుణగ్రహీతలు ఇద్దరూ ఈఎంఐలకు బాధ్యత వహించాల్సి రావచ్చు. ఒకరిని రుణ బాధ్యత నుంచి అధికారికంగా విడుదల చేసే వరకు క్రెడిట్ రికార్డుపైనా ప్రభావం పడొచ్చు. ఇంటి యాజమాన్యాన్ని మాత్రం రిజిస్టర్డ్ టైటిల్ డాక్యుమెంట్లు నిర్ణయిస్తాయి. రుణం, ఆస్తి విషయంలో విడాకుల సమయంలో స్పష్టమైన సెటిల్‌మెంట్ అవసరం.

వివాహ బంధం విడాకులతో ముగుస్తుంది. కానీ, దంపతులు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న రుణాల సంగతేంటి? వాటిపై ఇద్దరికీ ఉమ్మడి బాధ్యత ఉంటుందా? పాత బాకీ తాలూకూ ఈఎంఐలు కట్టే బాధ్యత భార్యాభర్తల్లో ఎవరిది అనేది ఎవరు నిర్ధారిస్తారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విడాకుల ఒప్పందం అనేది ఒక వ్యక్తి, అతని/ఆమె జీవిత భాగస్వామికి మధ్య కుదిరిన ఒక ఒప్పందం మాత్రమే. అది రుణదాతతో మీకున్న ఒప్పందాన్ని మార్చదు అంటున్నారు న్యాయనిపుణులు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నంత మాత్రాన ఉమ్మడి హోమ్‌లోన్ బాధ్యతలు వాటంతట అవే తొలగిపోవు. వివాహ బంధం ముగిసినా ఆర్థిక, న్యాయపరమైన ఒప్పందాలు అలాగే కొనసాగుతాయి. ఇద్దరూ కలిసి రుణం తీసుకున్న సందర్భాల్లో ఈఎంఐలు ఎవరు కట్టాలి? ఇల్లు ఎవరి పేరుపై ఉంటుంది? వంటి విషయాలపై స్పష్టత లేకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావాల్సి వస్తుంది. విడాకుల సమయంలో భార్యాభర్తల మధ్య కుదిరే సెటిల్‌మెంట్ ఒప్పందం కేవలం వారిద్దరి మధ్య మాత్రమే వర్తిస్తుంది తప్ప, బ్యాంకుతో చేసుకున్న రుణ ఒప్పందాన్ని మార్చలేదు. చాలా సందర్భాల్లో సహ రుణగ్రహీతలు సంయుక్తంగా, విడివిడిగా బాధ్యత కలిగి ఉంటారు. ఒకరు ఈఎంఐలు చెల్లించకపోతే, మరొకరిని చెల్లించమని బ్యాంకు కోరే హక్కు ఉంటుంది. బ్యాంకు అధికారికంగా ఒకరిని రుణ బాధ్యత నుంచి విడుదల చేసే వరకు ఇద్దరి క్రెడిట్ రికార్డుపై ప్రభావం పడుతుంది. దీనికోసం రీఫైనాన్సింగ్ లేదా రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఆశ్రయించాలి. హోమ్‌లోన్‌లో ఇద్దరి పేర్లు ఉన్నంత మాత్రాన ఇంటిపై సమాన హక్కులు ఉండవు. రిజిస్టర్డ్ టైటిల్ డాక్యుమెంట్లు మాత్రమే యాజమాన్యాన్ని నిర్ణయిస్తాయి. ఒకరు ఎక్కువ ఈఎంఐలు కట్టినంత మాత్రాన అదనపు హక్కు రాదు. అలాగే విడాకుల తర్వాత ఇల్లు విక్రయించాలనుకుంటే, వచ్చే మొత్తం నుంచి మొదట బ్యాంకు లోన్ తీర్చగా, మిగిలిన మొత్తాన్ని అధికారిక యాజమాన్య వాటాల ఆధారంగా పంచుకోవాలి. ఈ లావాదేవీలపై వర్తించే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నిబంధనలను కూడా ముందే బేరీజు వేసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

H1N1 virus: విజృంభిస్తున్న H1N1 వైరస్‌…ఫ్లూ వ్యాక్సిన్‌కు భారీగా పెరిగిన డిమాండ్

Konaseema: కోనసీమ జిల్లాలో అద్భుతం…150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ

Tirupati: ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!

ATM Robbery: పోలీస్‌ స్టేషన్‌ వద్దే రెచ్చిపోయిన దొంగలు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టి

Follow Us