Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad By Election: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు.. ఎందుకంటే..

Huzurabad By Election: హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. పోలింగ్ జరుగుతుండగా ప్రజలను ప్రలోభాలకు గురిచేసేలా..

Huzurabad By Election: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు.. ఎందుకంటే..
Trs Vs Bjp
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 30, 2021 | 1:15 PM

Huzurabad By Election: హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. పోలింగ్ జరుగుతుండగా ప్రజలను ప్రలోభాలకు గురిచేసేలా ప్రెస్ మీట్ పెట్టారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఫిర్యాదును లిఖిత పూర్వకంగా ఎన్నికల సంఘానికి పంపించారు టీఆర్ఎస్ నేతలు. కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈటల రాజేందర్. ఓటు వేసిన తరువాత ఈటల, ఆయన సతీమణి కలిసి మీడియాతో మాట్లాడారు. అయితే, పోలింగ్ జరుగుతుండగా.. ప్రెస్‌మీట్ పెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని టీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేర్కొంది. పైగా ప్రజలను ప్రభావితం చేసేలా అధికార పార్టీపై బురదజల్లే కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా.. ప్రజలందరూ తమవైపే ఉన్నారని, ప్రజల ఆశీర్వాదం తనకు ఉందంటూ కామెంట్స్ చేశారని అన్నారు. పోలింగ్ జరుగుతున్న వేళ ఇలాంటి కామెంట్స్ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని టీఆర్ఎస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటల భార్య కూడా సత్య ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. ఓటమి భయంతోనే ప్రభుత్వంపై ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద ఈటల రాజేందర్, ఆయన భార్యపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

కాగా, కరీంనగర్​జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం కందుగులలో పోలింగ్ కేంద్రాన్ని ఈటల రాజేందర్‌ పరిశీలించారు. జడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్‌ తీరును పరిశీలించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కమలాపూర్‌లోని పోలింగ్​కేంద్రం 262లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోందని ఆరోపించారు. తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారని, ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. మంచి చెడు ఆలోచించుకునే సత్తా ప్రజలకు ఉందంటూ కామెంట్స్ చేశారు.

Also read:

Whatsapp Chats Leak : వాట్సాప్‌ చాట్స్‌ ఎలా లీక్ అవుతోంది.. పూర్తి వివరాలు మీకోసం..!

ఆ ఆలయమే ఓ ప్రత్యేకం.. ఐదువందల ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద దేవాలయం అంగ్ కోర్ ఆలయం గురించి తెలుసా..

Telanagana News: కరోనా కష్టాలు.. ఇంటి యజమాని వేధింపులకు హాస్టల్ ఓనర్ బలి.. రెంట్ కట్టలేక ఆత్మహత్య