PM Modi: వచ్చే ఏడాది చివరి నాటికి 5 బిలియన్ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ అందిస్తాం..జి 20 దేశాలకు ప్రధాని మోడీ హామీ!
ఐదు రోజుల యూరప్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రెండో రోజు జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరుగుతున్న సమ్మిట్‌లో, వచ్చే ఏడాది చివరి నాటికి 5 బిలియన్ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని జి 20 దేశాల నాయకులకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
PM Modi: ఐదు రోజుల యూరప్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రెండో రోజు జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో జరుగుతున్న సమ్మిట్‌లో, వచ్చే ఏడాది చివరి నాటికి 5 బిలియన్ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని జి 20 దేశాల నాయకులకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ డోస్‌ల వ్యాక్సిన్‌లు కేవలం భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా, పేద దేశాలకు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రపంచ నాయకులు అంగీకరించారు.
అయితే, కోవాక్సిన్ అనే ఇండియన్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అత్యవసరంగా ఉపయోగించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి ఆమోదం పొందడంలో G20 దేశాల నుండి PM మోడీ సహాయం కోరారు. ఈ వ్యాక్సిన్‌ను భారతీయ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదం పొందిన తర్వాత 5 బిలియన్ వ్యాక్సిన్‌లను తయారు చేయాలనే లక్ష్యాన్ని భారత్ సులభంగా చేరుకోగలదని మోదీ అన్నారు.
రోమ్‌లో జరిగిన G20 గ్లోబల్ హెల్త్ అండ్ గ్లోబల్ ఎకానమీ సెషన్‌లో PM మోడీ పాల్గొన్నారు. ANI నివేదిక ప్రకారం , 150 దేశాలకు వైద్య సామాగ్రిని అందించడం ద్వారా సాధించిన విజయాన్ని భారత్ ఈ సమావేశాల్లో వివరించింది. భారత వైద్య సామాగ్రి గురించి జీ20 దేశాల నేతలకు ప్రధాని చెప్పారని ఆయనతో పాటు వచ్చిన విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. కోవిడ్ -10 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, భారతదేశం 150 దేశాలకు వైద్య సామాగ్రిని అందించిందని ప్రధాని చెప్పారు. భారతదేశంలోని ఒక బిలియన్ మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ ఇవ్వడంలో తమ ప్రభుత్వం సాధించిన విజయం గురించి కూడా ప్రధాన మంత్రి తెలియజేసినట్లు ష్రింగ్లా చెప్పారు.
సమ్మిట్ ప్రారంభంలో జరిగిన సెషన్‌లో, ఇంధన రంగంలో కలిసి పనిచేయడానికి ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి అంగీకరించారు. G-20 నాయకులందరూ ఫ్రంట్‌లైన్ కార్మికులతో ఫోటో తీసుకున్నారు. దీని తర్వాత గ్లోబల్ ఎకానమీ అండ్ హెల్త్ అనే అంశంపై సెషన్ జరిగింది.
ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్‌లను చేరవేయడానికి మన ప్రయత్నాలను రెట్టింపు చేయాలని ఇటలీ ప్రధాని డ్రాగి అన్నారు. సంపన్న దేశాల్లో 70% మందికి వ్యాక్సిన్ వేయగా, పేద దేశాల్లో కేవలం 3% మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారని అన్నారు. ఇది అనైతికం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరాన్ అణు ఒప్పందం పై చర్చ..
సమావేశంలో, ఇరాన్ అణు ఒప్పందానికి కూడా చర్చించారు. ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించేందుకు కృషి చేయాలని జీ-20 దేశాల అధినేతలు సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని భేటీ
అంతకుముందు, వాటికన్ సిటీకి చేరుకున్న మోడీ, కాథలిక్ క్రైస్తవుల అతిపెద్ద మత గురువు మరియు స్టేట్ సెక్రటరీ కార్డినల్ పియట్రో పరోలిన్ పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. అయితే, విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వనందున, ఈ సమావేశం ప్రధానమంత్రి అధికారిక షెడ్యూల్‌లో భాగం కాదు.
ముఖ్యమైన సమావేశం
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మ్యాక్రాన్ తో మ్యాక్రాన్ మోడీ సమావేశం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. గత నెలలో వీరిద్దరి మధ్య ‘ఔకస్’ వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. అయితే, ఈ సంభాషణ ఫోన్‌లో జరిగింది. జలాంతర్గామి ఒప్పందానికి సంబంధించి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య చాలా ఉద్రిక్తతలు ఉన్నాయి. దాని ప్రభావం ఎక్కడో AUKUS పై ప్రత్యక్షంగా కనిపించింది. అయితే ప్రస్తుతానికి జో బిడెన్, మాక్రాన్ మధ్య చర్చలు జరగడంతో వ్యవహారం కాస్త చల్లారిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..
Rahul Gandhi: మోటర్ సైకిల్ టాక్సీపై రాహుల్.. గోవా ఎన్నికల ప్రచార పర్వానికి ముందు ఇలా..