Rahul Gandhi: మోటర్ సైకిల్‌ టాక్సీపై రాహుల్.. గోవా ఎన్నికల ప్రచార పర్వానికి ముందు ఇలా..

ఈత కొట్టారు..చేపలు పట్టారు.. ట్రాక్టర్‌ నడిపారు.. తాటి ముంజెలు తింటూ ఫోజులిచ్చారు. డ్యాన్సులు, ఎక్సర్‌సైజులు కూడా చేశారు. ఏంటి..ఇవన్నీ అనుకుంటున్నారా..? ఇది కేరళ ఎన్నికల సమయంలో.. అదే ఇప్పుడు గోవా ఎన్నికలకు ముందు..

Rahul Gandhi: మోటర్ సైకిల్‌ టాక్సీపై రాహుల్.. గోవా ఎన్నికల ప్రచార పర్వానికి  ముందు ఇలా..
Rahul
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 30, 2021 | 7:16 PM

ఈత కొట్టారు..చేపలు పట్టారు.. ట్రాక్టర్‌ నడిపారు.. తాటి ముంజెలు తింటూ ఫోజులిచ్చారు. డ్యాన్సులు, ఎక్సర్‌సైజులు కూడా చేశారు. ఏంటి..ఇవన్నీ అనుకుంటున్నారా..? కేరళ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గెటప్స్‌. అదే ఇప్పుడు గోవా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలా ప్రయత్నం మొదలు పెట్టారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. వచ్చే ఎన్నికల్లో పార్టీని అందలమెక్కించేందుకు రాహుల్ ఇంత కష్టపడుతున్నారు. ఎలక్షన్స్‌ టైమ్‌లో లీడర్ల వేషాలు ఇంతింత కాదయా అంటారు కదా..అవును..ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గోవాలో మోటర్ సైకిల్‌ టాక్సీపై ప్రయాణించారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం గోవాలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడికి ఆయన ఓ రోజు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ప్రచార సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర రాజధాని పనాజీలో గోవాకు చెందిన మోటార్‌సైకిల్ టాక్సీ ‘పైలట్’ వాహనంపై ప్రయాణించారు. దక్షిణ గోవాలోని వెల్సావో బీచ్‌లో మత్స్యకారుల సంఘం సభ్యులతో కూడా సంభాషించారు.

రాహుల్ గాంధీ రైడ్ చేస్తున్న వీడియోను ANI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. వీడియోలో గాంధీ, మాస్క్ ,హెల్మెట్ ధరించి కనిపించారు. బాంబోలిమ్ నుండి పనాజీలోని ఆజాద్ మైదాన్‌కు కలిసి రైడ్ చేశారు. ‘మోటార్‌సైకిల్ టాక్సీ’ నడుపుతున్న మరొక వ్యక్తి వెనుక కూర్చున్నట్లు కనిపించారు.

రాష్ట్రంలోని వివిధ వాటాదారులతో చర్చలు జరిపిన తర్వాత తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తుందని.. అందులో పర్యావరణ పరిరక్షణపై ఫోకస్ ఉంటుందని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై కూడా విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..

Surat Sarees: చీరల వ్యాపారులకు షాకింగ్ న్యూస్.. సూరత్‌లో పెరుగనున్న ధరలు.. ఎంత పెరుగొచ్చంటే..

PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..