Postal Jobs: ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ..
Postal Jobs: భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్‌మెంట్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సోస్టల్ సర్కిల్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పోస్టులను స్పోర్ట్స్ కోటా ఆధారంగా
Postal Jobs: భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్‌మెంట్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సోస్టల్ సర్కిల్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పోస్టులను స్పోర్ట్స్ కోటా ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయో పోస్టులు ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 75 పోస్టులకు గాను పోస్టల్ అసిస్టెంట్ (19), సార్టింగ్ అసిస్టెంట్ (04), పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్ / రీజినల్ ఆఫీస్ (03), పోస్టల్ అసిస్టెంట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (04), పోస్ట్ మ్యాన్ (18), మల్టీ టాస్కింగ్ (27) ఖాళీలు ఉన్నాయి.
* ఆర్చరీ, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, చెస్, సైక్లింగ్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, షూటింగ్ వంటి క్రీడాంశాల్లో అభ్యర్థులను ఎంచుకోనున్నారు.
* పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జాతీయ/ అంతర్జాతీయ/ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
* అభ్యర్థులకు తెలుగులో మాట్లాడడం వచ్చి ఉండాలి.
* పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్/ పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను విద్యార్హతలు, క్రీడార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 200 చెల్లించాలి.
* దరఖాస్తు స్వీకరణకు 27-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Puneeth Rajkumar : ఇప్పటి వరకూ కేవలం తల్లిగా ఒక పాత్రే.. ఇకపై తన కూతుళ్లకు తండ్రిగానూ..
Google New Feature: ఐఫోన్ వినియోగదారులు గుడ్‌న్యూస్.. అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్