Puneeth Rajkumar : ఇప్పటి వరకూ కేవలం తల్లిగా ఒక పాత్రే.. ఇకపై తన కూతుళ్లకు తండ్రిగానూ..

నిన్నటి వరకు నవ్వుతు కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా కనుమరుగయ్యారు. సందడిగా సంతోషంగా ఉన్న మనిషి ఇప్పుడు నిర్జీవంగా ఉండిపోయాడు.

Puneeth Rajkumar : ఇప్పటి వరకూ కేవలం తల్లిగా ఒక పాత్రే.. ఇకపై తన కూతుళ్లకు తండ్రిగానూ..
Puneeth
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 30, 2021 | 8:37 PM

Puneeth Rajkumar :  భర్త చనిపోయిన బాధ హృదయాన్ని మెలిపెడుతుంటే.. ఇద్దరు కూతుళ్ల బాధ్యత మరోపక్క గుర్తు చేస్తూ వేధిస్తుంది. ఇప్పటి వరకూ కేవలం తల్లిగా ఒక పాత్రే.. ఇకపై తన కూతుళ్లకు తండ్రిగానూ రెండో పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తనే ఇతరుల నుంచి ఓదార్పు పొందాల్సిన స్థితి.. తాను మరో ఇద్దరికి ధైర్యం పంచాల్సిన పరిస్థితి.. ఇక్కడే గుండె దిటువు చేసుకుంటూ..తన కూతుళ్లిద్దరినీ దగ్గరకు తీసుకుంటూ.. ఒక తల్లి మూగరోదన.. కంటికి కనిపించని ఆక్రందన.. వెరసీ పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని..

నిన్నటి వరకు నవ్వుతు కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా కనుమరుగయ్యారు. సందడిగా సంతోషంగా ఉన్న మనిషి ఇప్పుడు నిర్జీవంగా ఉండిపోయాడు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న జీవితంలో శోకం నిండిపోయింది. నవ్వుతు పలకరించే నాన్న ఆ పిల్లలకు దూరమయ్యాడు. ప్రేమగా పలకరించే భర్త ఆ ఇల్లాలిని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అశేష అభిమానుల కళ్లలో కన్నీళ్లు నింపి పునీత్ ఇక సెలవంటూ నింగికి ఎగిశారు. కన్నడ స్టార్ పునీత్ మరణం యావత్ దేశాన్ని కలిచివేసింది. పునీత్ మరణంతో అనీ ఇండస్ట్రీల ప్రేక్షకుల హృదయాలు బరువెక్కాయి. ఆ ఇంటికి ఇప్పుడు ఆ ఇల్లాలే దిక్కు అయ్యింది.

ఇక పునీత్ రాజ్ కుమార్.. అశ్విని.. తమ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. ముందుగా స్నేహంగా మారిన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఎనిమిది నెలల స్నేహం తర్వాత పునీత్ అశ్వినికి ప్రపోజ్ చేయగానే.. ఆమె వెంటనే అంగీకరించింది. ఇక సినిమాల్లో మాదిరిగానే పునీత్ ప్రేమకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఎంతో ఒపిగ్గా తమ పెద్దవారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి పునీత్ కుటుంబసభ్యులు ఒప్పుకున్నా.. అశ్విని కుటుంబసభ్యులు మాత్రం అంగీకరించలేదు. కానీ ఆరు నెలల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చివరకు 1999న డిసెంబర్ ఒకటిన వీరి వివాహం జరిగింది. వీరికి దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటను చూసి వీధికి కన్నుకుట్టుంది… అర్థాంతరంగా పునీత్ మరణంతో అశ్విని ఒంటరిగా అయిపోయింది. 1981లో అశ్విని కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించారు. ప్రస్తుతం ఆమె శాండల్‏వుడ్‏లో ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్‏గా చేస్తున్నారు. పునీత్.. అశ్వినీ కలిసి పీఆర్కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు.

ఎప్పుడు సందడిగా సంతోషంగా గడిపే పునీత్ ని మరణం మనమధ్య నుంచి దూరం చేసింది. గుండె పోటుతో కుప్పకూలిన పునీత్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్త విని అభిమానుల హృదయాలు బద్దలయ్యాయి. కన్నడ ఇండస్ట్రీని శోకం కమ్మేసింది. ఒక్కసారిగా కంఠీరవ స్టేడియంలో నిశబ్దం నెలకొంది. అంతా బోరున విలపించారు. అదే.. కన్నడ స్టార్‌ పునీత్‌ తనయ దేశం కాని దేశం అమెరికా నుంచి వచ్చి తండ్రిని చూడరాని స్థితిలో చూసి కన్నీటి పర్వంతమయింది. తల్లీ కూతుళ్లను ముగ్గురిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తండ్రి భౌతికకాయంపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదివారం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నివహించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpaka Vimanam: పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ లైవ్.. చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

Puneeth Rajkumar: ‘మనుష్యులందు నీ కథ… మహర్షిలాగ సాగదా’.. కంఠీరవ కిక్కిరిసింది ఇందుకే