AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మొన్నటివరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు యూకే గేమింగ్‌ కంపెనీకి డైరెక్టర్‌.. ఎవరంటే?

ఈ హీరోయిన్ పలు తెలుగు సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. అయితే వరుసగా ఫ్లాపులు పడడంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. కట్ చేస్తే.. ఈ హీరోయిన్ ఇప్పుడు యూకే బేస్డ్ గేమింగ్ కంపెనీకి డైరెక్టర్ గా నియమితురాలైంది.

Tollywood: మొన్నటివరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు యూకే గేమింగ్‌ కంపెనీకి డైరెక్టర్‌.. ఎవరంటే?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Feb 26, 2026 | 5:23 PM

Share

హీరోలతో పోల్చకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ. వరుసగా ఒకటి, రెండు ఫ్లాపులు పడితే చాలు హీరోయిన్ గా అవకాశాలు కనుమరుగవుతాయి. సెకెండ్ హీరోయిన్ లేదా సహాయక నటి పాత్రలు వస్తాయి. కొందరికైతే ఇవి కూడా రావు. దీంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమవుతారు హీరోయిన్లు. ఇప్పుడు మనం చెప్పుకోబోతోన్న ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. చాలా మంది లాగే ఈ హీరోయిన్ కూడా మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మక ఫెమినా మిస్ ఇండియా పోటీలో టాప్ టెన్‌లో నిలవడంతో పాటు ఫ్రెష్ ఫేస్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమానే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పక్కన చేసింది. తన అందం, అభినయంతో కుర్రకారను కట్టి పడేసింది. సినిమా కూడా హిట్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రభాస్, రవితేజ, గోపీచంద్, విక్రమ్, మంచు మనోజ్, దర్శన్ (కన్నడ హీరో) ఇలా స్టార్ హీరోల సినిమాల్లో కథానాయకిగా నటించింది. అలాగే కొన్ని హిందీ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. కానీ ఇందులో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి. 2021 లో చివరి సారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించిందీ అందాల తార.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ఈ అందాల తార ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ ను ఎంచుకుంది. యూకేలోని ఒక గేమింగ్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇంతకీ ఆ అందాల తార ఎవరనుకుంటున్నారా? వేదం హీరోయిన్ దీక్షా సేథ్. రవితేజ తో మిరపకాయ్, గోపీచంద్ తో వాంటెడ్, మంచు మనోజ్ తో ఊ కొడతారా ఉలిక్కి పడతారా తదితర సినిమాల్లో నటించిందీ అందాల తార. అయితే ఇప్పుడు సినిమా కెరీర్ ను విడిచి పెట్టిన ఈ ముద్దుగుమ్మ IESE Business School నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. . ప్రస్తుతం యూకేకు చెందిన ఒక గేమింగ్ కంపెనీలో Director – Business Development & Strategic Partnerships గా పని చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు లింక్డ్‌ ఇన్‌లో కూడా ఈ కెరీర్ మార్పును deliberate shiftగా వివరించింది దీక్ష. దీంతో ఈ బ్యూటీ పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఎంబీఏ పూర్తి చేసి..

View this post on Instagram

A post shared by Deeksha Seth (@deeksha721)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మొన్నటివరకు టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్
మొన్నటివరకు టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్
విరోషి పెళ్లి వేడుకలో టాప్‌ 9 విశేషాలు..
విరోషి పెళ్లి వేడుకలో టాప్‌ 9 విశేషాలు..
జింబాబ్వేతో కీలక పోరుకు భారత్ రెడీ.. ఓడితే టోర్నీ నుంచి ఔట్
జింబాబ్వేతో కీలక పోరుకు భారత్ రెడీ.. ఓడితే టోర్నీ నుంచి ఔట్
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే