Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

అప్పూతో కెరీర్ స్టార్ట్ చేసిన పునీత్ రాజ్ కుమార్.. నటసార్వభౌమగా.. తండ్రి నటవారసత్వం నిరూపిస్తూనే.. రాజకుమారుడిగా.. ఒక వెలుగు వెలుగుతూనే.. సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.

Puneeth Rajkumar Daughter: 'డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా'.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె
Puneeth Daughter
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 30, 2021 | 8:07 PM

గుండెలను గుడిగా చేసిన నాన్నిక లేడని తెలిసి పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి తల్లడిల్లిపోయింది. తమకోసమే తపించిన గుండె ఆగిందని తెలిసి ఆ చిన్ని హృదయం చివురుటాకులా వణికిపోయింది. అల్లంత దూరాన అమెరికా నుంచి ఆఘమేఘాల మీద పయనమైంది. ఏడ్చి ఏడ్చి కన్నీరింకిపోయాయి. పిలిచి పిలిచి నాన్నిక లేడని, రాలేడన్న వాస్తవం ఆమెను నిశ్చేష్టురాలిని చేసింది. తెలియని నిస్సహాయత చుట్టుముట్టేసింది. నాన్నని చూడగానే గుండె గొంతుకలోకొచ్చినట్టయ్యింది. నాన్నా ఒక్కసారి ఒకే ఒక్కసారి రాలేవా అంటూ లోలోపల గుండెలవిసేలా విలపిస్తోంది.

అమెరికా నుంచి వచ్చి తండ్రిని చూడరాని స్థితిలో చూసి కన్నీటి పర్వంతమయింది ధృతి. తల్లీ కూతుళ్లను ముగ్గురిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తండ్రి భౌతికకాయంపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా.. నీవు ఇక మాకు కనిపించవా అంటూ బోరున విలపించారు. అంతకు ముందు అమెరికా నుంచి డైరెక్ట్‌గా వచ్చిన ధృతి.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక కాన్వాయ్‌లో ఇంటికి చేరుకొని.. ఆ వెంటనే తండ్రి భౌతికకాయం ఉన్న కంఠీరవ స్టేడియానికి వచ్చారు. వచ్చి రాగానే ఒక్కసారిగా పార్ధీవదేహంపై పడి విలపించారు. మరో వైపు అమెరికా నుంచి కూతురు రావడంతో.. పునీత్‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. తండ్రి రాజ్‌కుమార్ సమాధి పక్కనే పునీత్‌ అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు అంత్యక్రియలను జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Also Read: Puneeth Rajkumar: ‘మనుష్యులందు నీ కథ… మహర్షిలాగ సాగదా’.. కంఠీరవ కిక్కిరిసింది ఇందుకే

పునీత్ మరణ వార్త చదువుతూ లైవ్‌లో గుండెలవిసేలా రోదించిన యాంకర్… Watch Video