SA vs SL Match Result: మిల్లర్ ‘కిల్లింగ్’ ఇన్నింగ్స్‌.. 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం.. సెమీస్ ఆశలు సజీవం

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా టీం 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక విధించిన టార్గెట్‌ను మరో బంతి మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

SA vs SL Match Result: మిల్లర్ 'కిల్లింగ్' ఇన్నింగ్స్‌.. 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం.. సెమీస్ ఆశలు సజీవం
T20 World Cup 2021, Sa Vs Sl
Follow us
Venkata Chari

|

Updated on: Oct 30, 2021 | 7:30 PM

T20 World Cup 2021, SA vs SL Match Result: టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక (SA vs SL) జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా టీం 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక విధించిన టార్గెట్‌ను మరో బంతి మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా టీం సెమీస్ రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకుంది. శ్రీలంక మాత్రం తన సెమీస్ ఆశలను దాదాపుగా కోల్పోయింది. 143 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్రికా జట్టు మరో బంతి మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో డేవిడ్ మిల్లర్ 13 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్‌లో సౌతాఫ్రికా గెలవడానికి 15 పరుగులు అవసరం. శ్రీలంక టీం విజయం సాధిస్తుందని అనుకున్నారంత. కానీ, మిల్లర్ కిల్లింగ్ ఇన్నింగ్స్‌తో రెండవ, మూడవ బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో శ్రీలంక సెమీస్ ఆశలకు గండి పెట్టాడు.

హసరంగా హ్యాట్రిక్.. వనిందు హసరంగ టీ20 ఇంటర్నేషనల్స్‌లో హ్యాట్రిక్ సాధించిన శ్రీలంక తరపున ఐదవ ఆటగాడిగా, టీ20 ప్రపంచ కప్‌లో మూడవ ఆటగాడిగా నిలిచాడు. హసరంగా కంటే ముందు, ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ బ్రెట్ లీ 2007 టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై, ఐర్లాండ్‌కు చెందిన కర్టిస్ కాంప్‌ఫర్‌తో నెదర్లాండ్స్‌పై హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్ టీ20 క్రికెట్‌లో ఇది 23వ హ్యాట్రిక్.

లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా పేలవమైన ఆరంభాన్ని అందించింది. నాల్గవ ఓవర్‌లో దుష్మంత చమీర రెండో బంతికి రీజా హెండ్రిక్స్ (11), నాల్గవ బంతికి క్వింటన్ డి కాక్ (12) వికెట్లను తీశాడు. రైసీ వాన్ డెర్ డస్సెన్ (16) రూపంలో దక్షిణాఫ్రికా మూడో వికెట్ పడింది. దాసున్ షనక కొట్టిన డైరెక్ట్ హిట్‌తో అతను రనౌట్ అయ్యాడు. ఐడెన్ మార్క్రామ్, టెంబా బౌమా నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 47 పరుగులు జోడించి జట్టులో ఆశలు చిగురించింపజేశాడు. ఈ భాగస్వామ్యాన్ని మర్క్‌రామ్ (19)ను అవుట్ చేయడం ద్వారా హసరంగా విడదీశాడు.

అంతకుముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక తరుపున ఓపెనర్ పాతుమ్ నిసంక 72 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. దక్షిణాఫ్రికా తరఫున తబ్రేజ్ షమ్సీ నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టగా, డ్వేన్ ప్రిటోరియస్ మూడు ఓవర్లలో 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఎన్రిచ్ నార్కియాకు రెండు వికెట్లు దక్కాయి.

Also Read: ENG vs AUS Live Score, T20 World Cup 2021: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ప్లేయింగ్ XI ఎవరున్నారంటే?

IND vs NZ: పాక్ బౌలర్‌లా రెచ్చిపోతామన్న బౌల్ట్.. అదే రేంజ్‌లో దాడి చేస్తామన్న కోహ్లీ.. ఢీ అంటే ఢీ అంటోన్న ప్లేయర్లు