ENG vs AUS Match Highlights: రెచ్చిపోయిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్.. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం..
ENG vs AUS Live Score in Telugu: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ టీం ముందు 126 పరుగుల అత్యల్ప స్కోర్ ఉంచింది.
ENG vs AUS Live Score, T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా ఇచ్చిన టార్గెట్‌ను ఇంగ్లండ్ టీం కేవలం 11.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 126 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ టీం ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ (71 పరుగులు, 32 బంతులు, 5 ఫోర్లు, 5 సిక్సులు ధాటిగా ఆడి విజయాన్ని ఎంతో సులువు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సులతో మొత్తం 76 పరుగులు కేవలం బౌండరీలతోనే రావడం విశేషం.
ఇక అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తడబడింది. ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో ఆరోన్ ఫించ్ 44(49 బంతులు, 4 ఫోర్లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాడె 18, అగర్ 20, పాట్ కమిన్స్12, మిచెల్ 13 మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వార్నర్ 1, స్మిత్ 1, మ్యాక్స్‌వెల్ 6, స్టోయినీస్ 0, జంపా 1 సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హజల్ వుడ్ 0 నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 1, క్రిస్ వోక్స్ 2, క్రిస్ జోర్డాన్ 3, లియాయ్ లివింగ్ స్టోన్ 1, టైమల్ మిల్స్ 2 వికట్లు పడగొట్టారు.
ఇది చిరకాల ప్రత్యర్థుల మధ్య ఘర్షణ. టోర్నమెంట్‌లోని సూపర్ 12 దశల్లో తమ తొలి మ్యాచులను అద్భుతమైన ఆరంభంతో మొదలుపెట్టిన రెండు జట్ల మధ్య ఘర్షణ జరగనుంది. ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండూ గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఈ మ్యాచ్‌లో రెండు టీంలు ఫుల్ ఫామ్‌లో ఉన్నాయి.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ టీంలు ఇప్పటి వరకు 19 టీ20ల్లో తలపడ్డారు. ఇందులో ఆస్ట్రేలియా 10, ఇంగ్లండ్ 8 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో మాత్రం ఫలితం తేలలేదు. రెండు టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఒక్కో విజయం సాధించాయి. 2010 ఫైనల్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడం ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్‌లో తలపడడం చివరిసారి.
ప్లేయింగ్ XI : ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్(w), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్
LIVE Cricket Score & Updates
-
ఇంగ్లండ్ భారీ విజయం..
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా జట్టు ఇచ్చిన 126 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా చేధించింది. కేవలం 11.4 ఓవర్‌లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
-
జోస్ బట్లర్ అర్థ సెంచరీ
తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ తొలి బంతి నుంచి ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. 220 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి కేవలం 25 బంతుల్లో తన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
-
-
8 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్..
8 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం 1 వికెట్ నష్టపోయి 82 పరుగులు సాధించింది. క్రీజులో జోస్ బట్లర్ 49, డేవిడ్ మలన్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ విజయానికి మరో 44 పరుగులు చేయాల్సి ఉంది.
-
తొలి వికెట్ డౌన్..
జాసన్ రాయ్ 22(20 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పరుగుల వద్ద ఇంగ్లండ్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
-
6 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్..
6 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం 66 పరుగులు సాధించింది. క్రీజులో జాసన్ రాయ్ 22, జోస్ బట్లర్ 39 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ విజయానికి మరో 60 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్..
4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం 37 పరుగులు సాధించింది. క్రీజులో జాసన్ రాయ్ 18, జోస్ బట్లర్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ విజయానికి మరో 89 పరుగులు చేయాల్సి ఉంది.
-
ఇంగ్లండ్ టార్గెట్ 126
ఇంగ్లండ్ టాస్ గెలవడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆది నుంచి చివరి వరకు పరుగులు చేసేందుకు అష్టకష్టాలు పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది
-
ఎనిమిదో వికెట్ డౌన్..
కమిన్స్ సున్నా పరుగుల వద్ద జోర్డాన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 110 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది.
-
ఏడో వికెట్ డౌన్..
ఆరోన్ ఫించ్ 44(49 బంతులు, 4 ఫోర్లు) పరుగుల వద్ద జోర్డాన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
ఆరో వికెట్ డౌన్..
ఆస్ట్రేలియా టీంకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ అత్యల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా ఉంది. అష్టన్ అగర్ 20 పరుగుల వద్ద టైమల్ మిల్స్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
17వ ఓవర్‌లో 20 పరుగులు
క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఇందులో 2 సిక్సులు, 1 ఫోర్ ఉంది. 17 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు సాధించింది. క్రీజులో అషటన్ అగర్ 19, ఆరోన్ ఫించ్ 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
16 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్..
16 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా టీం 5 వికట్లు కోల్పోయి 75 పరుగులు సాధించింది. క్రీజులో అషటన్ అగర్ 6, ఆరోన్ ఫించ్ 40 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
ఐదో వికెట్ డౌన్..
ఆస్ట్రేలియా టీంకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ అత్యల్ప స్కోర్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. మాథ్యూ వేడ్ 18 పరుగుల వద్ద లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో రాయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
T20 World Cup 2021: పవర్ ప్లేలో అత్యప్ప స్కోర్లు నమోదు చేసిన జట్లు
17/4 PNG vs BAN అల్ అమెరత్ 21/3 Aus vs Eng దుబాయ్ 22/4 Sco vs NAM అబుదాబి
-
నాలుగో వికెట్ డౌన్..
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆస్ట్రేలియా టీంకు కష్టాలు మొదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్ టీం.. ఆదిల్ రషీద్ మరో వికెట్ తీసి దెబ్బ కొట్టాడు. మార్కస్ స్లోయినిస్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో 6.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ డౌన్..
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆస్ట్రేలియా టీంకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ టీంను క్రిస్ వోక్స్ మరో వికెట్ తీసి దెబ్బ కొట్టాడు. మ్యాక్స్‌వెల్‌ను ఎల్బీగా ఔట్ చేసి పెవిలియన్ చేర్చాడు.
-
రెండో వికెట్ డౌన్
ఆస్ట్రేలియా ఇన్నింగ్ ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జోర్డాన్ వేసిన బంతిని ఫుల్ చేయబోయిన స్మిత్(1) ఫీల్డర్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
-
తొలి వికెట్ డౌన్
ఆస్ట్రేలియా ఇన్నింగ్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వార్నర్ (1) పెవిలియన్ చేరాడు.
-
AUS vs ENG LIVE: ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: మార్ష్ స్థానంలో అగర్.. ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (కీపర్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
-
AUS vs ENG LIVE: ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: మార్పు లేదు ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, జోస్ బట్లర్ (కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, టిమల్ మిల్స్, ఆదిల్ రషీద్.
-
AUS vs ENG Live: టాస్ గెలిచిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ XIలో ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన జట్టును మాత్రమే రంగంలోకి దించింది.
-
హెడ్ టు హెడ్ రికార్డులు
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ టీంలు ఇప్పటి వరకు 19 టీ20ల్లో తలపడ్డారు. ఇందులో ఆస్ట్రేలియా 10, ఇంగ్లండ్ 8 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో మాత్రం ఫలితం తేలలేదు. రెండు టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఒక్కో విజయం సాధించాయి. 2010 ఫైనల్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడం ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్‌లో తలపడడం చివరిసారి.
Published On - Oct 30,2021 6:41 PM