Telangana: అక్కడ మరోసారి భూప్రకంపనలు… రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత, స్థానికుల్లో ఆందోళన!
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో అర్థరాత్రి 3.9 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. మంచిర్యాల జిల్లాకు 57 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ప్రజలు పెద్దగా గుర్తించకపోయినా, సిస్మాలజిస్టులు గోదావరి నది, సింగరేణి బొగ్గు గనులను దీనికి కారణాలుగా చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఇది ఐదో భూకంపం కావడం గమనార్హం.

Telangana-Maharashtra Border Quake
మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గత అర్థరాత్రి 11:45 నిమిషాల ప్రాంతంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టార్ స్కేల్ పై 3.9 గా నమోదైంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి 57 కిమీ దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు గుర్తించారు. రాత్రివేళ భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు పెద్దగా గుర్తించలేకపోయారని అధికారులు తెలిపారు. గోదావరి నది.. సింగరేణి బొగ్గు గనుల కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని సిస్మాలజీ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది ఐదోసారి అని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Follow Us
