Huzurabad – Badvel By Election Highlights: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్

Shaik Madar Saheb

| Edited By: Subhash Goud

Updated on: Oct 30, 2021 | 9:35 PM

Huzurabad - Badvel By Election Highlights: తెలుగు రాష్ట్రాలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది..

Huzurabad - Badvel By Election Highlights: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్
Huzurabad Badvel By Elect

Huzurabad – Badvel By Election Highlights: తెలుగు రాష్ట్రాలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ పోలింగ్ జరిగింది. పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలతో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. చివరి గంటలో కోవిడ్ బాధితులు పీపీఈ కిట్లతో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

హుజూరాబాద్.. హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరుపున కూడా ఆ పార్టీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు. 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లల్లో మహిళలు లక్షా 17 వేల 563 మంది, పురుషులు లక్షా 18వేల 720 మంది ఉన్నారు. అధికారులు 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని మోహరించారు.

బద్వేల్‌.. ఏపీ బద్వేల్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నియోజకవర్గంలో 2,15,292 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బరిలో అధికార వైసీపీ సహా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నియోజకర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 221 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అదనపు బలగాలను మోహరించారు. మొత్తం 3000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఈ నియోజవర్గంలో 914 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ, బీజేపీ పోటి నెలకొంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Oct 2021 08:34 PM (IST)

    రికార్డు సృష్టించిన హుజూరాబాద్ బై పోల్

    గత ఎన్నికల పోలింగ్ శాతాన్ని బీట్ అవుట్ చేసిన పోలింగ్. హుజూరాబాద్‌లో 7 గంటలకు 86. 40 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా 4 పోలింగ్ బూత్‌లలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్‌ సమయం ముగిసినా క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే హక్కు కల్పించారు అధికారులు. ఈ నాలుగు బూత్‌లు పూర్తియితే మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. 220, 223, 224, 237 బూత్‌లలో పోలింగ్‌ కొనసాగుతోంది.

  • 30 Oct 2021 08:22 PM (IST)

    బద్వేల్‌లో 7 గంటల వరకు 68.12 శాతం పోలింగ్‌ నమోదు

    బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 68.12 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్‌లో చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, మొత్తం మీద పోలింగ్‌ ప్రశాతంగా ముగిసిందని వెల్లడించారు.

  • 30 Oct 2021 07:55 PM (IST)

    హుజూరాబాద్‌లో 7 గంటలకు వరకు 86.4 పోలింగ్‌ శాతం

    హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి  7 గంటల వరకు 86.4 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్‌లో చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, మొత్తం మీద పోలింగ్‌ ప్రశాతంగా ముగిసిందని వెల్లడించారు.

  • 30 Oct 2021 07:28 PM (IST)

    గత రికార్డును బ్రేక్‌ చేసే దిశగా హుజూరాబాద్‌ పోలింగ్‌..

    హుజూరాబాద్‌ పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు. పోలింగ్‌ ముగిసే సమయానికి 90 శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. 2018లో 84.42 శాతం పోలింగ్‌ నమోదు కాగా, గత రికార్డును బ్రేక్‌ చేసే దిశగా పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల సమయానికి 76.26 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 30 Oct 2021 07:04 PM (IST)

    ముగిసిన బద్వేల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

    ఏపీలోని బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ సందర్భంగా అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. నవంబర్‌ 2న ఫలితం వెలువడనుంది.

  • 30 Oct 2021 07:01 PM (IST)

    ముగిసిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల పోలింగ్‌

    తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. నవంబర్ 2న ఫలితం వెలువడనుంది.

  • 30 Oct 2021 06:57 PM (IST)

    మరి కొద్దిసేపట్లో ముగియనున్న బద్వేల్‌ పోలింగ్‌

    కడప: బద్వేల్‌లో మరికొద్ది సేపట్లో ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగియనుంది. అక్కడక్కడ ఘర్షణలతో మొత్తం మీద పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికు ఎక్కడ కూడా ఆవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎస్పీ తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

  • 30 Oct 2021 06:37 PM (IST)

    తుది దశకు చేరుకున్న హుజూరాబాద్‌ పోలింగ్‌

    హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్ తుది దశకు చేరుకుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ప్రస్తుతం 6 గంటల నుంచి 7 గంటల వరకు కోవిడ్‌ బాధితుల కోసం కేటాయించారు. కరోనా రోగుల ఎవరైనా ఉన్నా లేదా సాధారణ ఓటర్లు తమ గుర్తింపు కార్డుతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

  • 30 Oct 2021 05:39 PM (IST)

    బద్వేల్‌లో 5 గంటల వరకు పోలింగ్‌ శాతం 59.6

    బద్వేల్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. చిన్న పాటి ఘర్షణలు తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 59.6 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • 30 Oct 2021 05:25 PM (IST)

    హుజురాబాద్ ఉప ఎన్నికలో పరుగులు పెడుతున్న పోలింగ్ శాతం

    * ప్రతి గంటకు 7. 62 శాతానికి మించి పోలింగ్

    * సాయంత్రం 4 గంటలకు 64 శాతం దాటిన పోలింగ్

    * ఉదయం 9 గంటలకు 10.50 శాతం * 11 గంటలకు 33.27 శాతం * 1 గంటలకు 45.63 శాతం * 3 గంటలకు 61.66 శాతం * 5 గంటల వరకు 76.26 శాతం

    * ఉదయం 7 టు 9 గంటల మధ్య 10.50 శాతం

    * 9 నుంచి 11 గంటల మధ్య 22.77 శాతం

    * 11 నుంచి మధ్యాహ్నం 1గంట మధ్య 12.36 శాతం

  • 30 Oct 2021 05:11 PM (IST)

    హుజూరాబాద్‌లో మధ్యాహ్నం 5 గంటల వరకు 76.26 పోలింగ్‌ శాతం

    హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

  • 30 Oct 2021 04:46 PM (IST)

    కమలాపూర్‌ మండలంలో టీఆర్‌ఎస్‌-బీజేపీ వర్గీయుల ఘర్షణ

    హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్‌ మండలం గూడూరులో టీఆర్‌ఎస్‌, బీజేపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. దొరికిన డబ్బును చూపిస్తూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారిని సర్ధి చెప్పి అక్కడి నుంచి పంపించారు.

  • 30 Oct 2021 04:44 PM (IST)

    ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు: శశాంక్‌ గోయల్‌

    హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా కమలాపూర్‌లో పోలింగ్‌ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తనిఖీ చేశారు. 306 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. వాటిని ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారన్నారు.

  • 30 Oct 2021 04:25 PM (IST)

    బద్వేల్‌లో మందకొడిగా పోలింగ్‌

    బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ మందకోడిగా కొనసాగుతోంది. పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకు 45 శాతం మాత్రమే పోలింగ్‌. 2019లో 76 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 30 Oct 2021 04:09 PM (IST)

    నగదు సీజ్‌

    హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటి వరకు రూ.3.50 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని అన్నారు. విచారణలో నిజాలు తేలితే చర్యలు తప్పవని శశాంక్‌ గోయల్‌ అన్నారు.

  • 30 Oct 2021 04:07 PM (IST)

    టీఆర్‌ఎస్‌-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

    మాల్యాలో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. అలాగే జమ్మికుంటలో పోలింగ్‌ కొనసాగుతోంది. నాన్‌ లోకల్స్‌ వారిని పోలీసులు పంపిస్తున్నారు. నాన్‌లోకల్స్‌ వారు ఓటు వేసేందుకు వస్తుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

  • 30 Oct 2021 04:02 PM (IST)

    చివరి గంటలో కోవిడ్‌ పేషెంట్లకు..

    హుజూరాబాద్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. చివరి గంటలో కోవిడ్‌ పేషెంట్లు ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ తెలిపారు.

  • 30 Oct 2021 03:40 PM (IST)

    బద్వేల్‌లో భారీ వర్షం

    బద్వేల్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పోలింగ్‌ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఓటర్లు సైతం పోలింగ్‌ కేంద్రాలకు రావడం లేదు. చాలా కేంద్రాల్లో క్యూ లైన్‌లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇలాగే వర్షం కొనసాగితే పోలింగ్‌ శాతం తగ్గే అవకాశం కనిపిస్తోంది.

  • 30 Oct 2021 03:16 PM (IST)

    బద్వేల్‌లో 3 గంటల వరకు పోలింగ్‌ శాతం 44.82

    బద్వేల్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. చిన్న పాటి ఘర్షణలు తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • 30 Oct 2021 03:15 PM (IST)

    హుజూరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 పోలింగ్‌ శాతం

    హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

  • 30 Oct 2021 03:13 PM (IST)

    హుజూరాబాద్‌ పోలింగ్‌పై కిషన్‌రెడ్డి ట్వీట్‌

    హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. ఉన్నతమైన పాలన కోసం మర్ధుడైన నాయకుడికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

  • 30 Oct 2021 02:58 PM (IST)

    పోలింగ్‌ కేంద్రాల వద్ద చిన్నపాటి ఘర్షణలు

    బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని, అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు జరుగుతున్నాయని, తర్వాత అన్ని కూడా సద్దుమణిగాయని సీఈవో విజయానంద్‌ అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

  • 30 Oct 2021 02:50 PM (IST)

    అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

    బద్వేల్‌ ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలలోవెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు చోట్ల మాక్‌పోలింగ్‌లో ఈవీఎంల సమస్య వచ్చింది. ఎక్కడా పోలింగ్‌ ఆగలేదని సీఈవో విజయానంద్‌ తెలిపారు. దొంగ ఓట్లు వేసేందుకు కొందరు వస్తున్నారన్న విషయం అబద్దమన్నారు.

  • 30 Oct 2021 02:46 PM (IST)

    ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి యత్నం

    బద్వేల్‌లో పోలింగ్‌ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి యత్నించారు.

  • 30 Oct 2021 02:45 PM (IST)

    పోలింగ్‌ బూత్‌లో సొమ్మసిల్లి పడిపోయిన గర్భిణీ

    బద్వేల్‌ ఓటింగ్‌ సందర్భంగా 261 పోలింగ్‌ బూత్‌లో ఓ గర్భవతి సొమ్మసిల్లి పడిపోయింది. బయటి నుంచి ఓట్లు వేసేందుకు కొందరు రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

  • 30 Oct 2021 02:43 PM (IST)

    పోలింగ్‌ స్టేషన్‌లో దొంగ ఓట్ల గొడవ

    బద్వేల్‌ పోలింగ్‌ సందర్భంగా అట్లూరు మండలంలో దొంగ ఓట్ల ఘర్షణ చోటు చేసుకుంది. ఫేక్‌ ఐడీలతో ఓట్లు వేసేందుకు వచ్చిన మహిళలను వెంటాపురంలోని గ్రామస్తులు అడ్డుకున్నారు.

  • 30 Oct 2021 02:27 PM (IST)

    ఉదయం నుంచి ఇప్పటి వరకు హుజూరాబాద్‌ పోలింగ్‌ శాతం వివరాలు..

    *  ప్రతి గంటకు 7శాతానికి మించి పోలింగ్

    *  లక్షకు పైగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు

    * ఉదయం 7 టు 9 గంటల మధ్య 10.50 శాతం

    * 9 నుంచి 11 గంటల మధ్య 22.77 శాతం

    * 11 నుంచి మధ్యాహ్నం 1గంట మధ్య 12.36 శాతం

    *  9 గంటలకు  10.50 శాతం *  11 గంటలకు 33.27 శాతం *  1 గంటకు 45.63 శాతం

  • 30 Oct 2021 02:23 PM (IST)

    బద్వేల్‌లో 2 గంటలకు 40 శాతం పోలింగ్‌

    కడపజిల్లా బద్వేల్ బైపోల్ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రం వద్ద జనం బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బద్వేల్, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, కాశి నాయన, కళశపాడు, పోరుమామిళ్ల మండలాలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ 40 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది.

  • 30 Oct 2021 02:22 PM (IST)

    హుజూరాబాద్‌లో కోవిడ్‌ నిబంధనలతో ఓటింగ్‌: శశాంక్‌ గోయల్‌

    హుజూరాబాద్‌లో కొవిడ్‌ రూల్స్‌ నడుమ పోలింగ్‌ కొనసాగుతోందన్నారు తెలంగాణ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌. ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా సహకరిస్తున్నారని తెలిపారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈసారి పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు.

  • 30 Oct 2021 02:20 PM (IST)

    డబ్బులు పంచుతున్న వ్యక్తిని పోలీసులకు అప్పగింత

    హుజూరాబాద్‌లో డబ్బులు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. హనుమాన్‌ ఆలయం వద్ద డబ్బులు పంచుతున్నట్లు సమాచారం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడి చేరుకుని ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.

  • 30 Oct 2021 02:16 PM (IST)

    పోలీసు స్టేషన్‌కు ఈటల పీఆర్‌వో

    నంబర్‌ ప్లేటు లేకుండా ఎన్నికల కమిషన్‌ అనుమతి లేకుండా కమలాపూర్‌ మండలంలోని మర్రిపల్లి గూడెంలో ఈటల రాజేందర్‌ వెంట తిరుగుతున్న వాహనాన్ని, అందులో ప్రయాణిస్తున్న ఈటల పీఆర్వో చైతన్యను పోలీసుస్టేషన్‌కు తరలించారు.

  • 30 Oct 2021 02:09 PM (IST)

    బద్వేలులో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటింగ్

    బద్వేలులో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓట్లు వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు అధికారులు.

  • 30 Oct 2021 01:47 PM (IST)

    జోరుగా కొనసాగుతున్న పోలింగ్..

    హుజూరాబాద్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. హుజూరాబాద్‌ నియోజకర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45.63 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 30 Oct 2021 01:10 PM (IST)

    Badvel: బద్వేల్ నియోజకర్గంలో 40 శాతం ఓటింగ్

    బద్వేల్ నియోజకర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 30 Oct 2021 01:08 PM (IST)

    Huzurabad: హుజూరాబాద్‌ నియోజకర్గంలో 45 శాతం ఓటింగ్

    హుజూరాబాద్‌ నియోజకర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45.63 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 30 Oct 2021 01:06 PM (IST)

    బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

    హిమ్మత్‌నగర్‌లో టీఆర్ఎస్-బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పోలింగ్ కేంద్రానికి వచ్చిన బీజేపీ నాయకురాలు తుల ఉమను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎందుకు వచ్చారంటూ ఉమ వాహనాన్ని అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 30 Oct 2021 01:01 PM (IST)

    Huzurabad: గెల్లు గ్రామం హిమ్మత్‌నగర్‌లో ఉద్రిక్తత..

    టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రామం హిమ్మత్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నాయకురాలు తుల ఉమ పోలింగ్ కేంద్రానికి రావడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

  • 30 Oct 2021 12:25 PM (IST)

    Huzurabad: సీఈవో శశాంక్ గోయల్ పర్యటన

    హుజూరాబాద్‌లో సీఈవో శశాంక్ గోయల్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హుజూరాబాద్‌లో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ.. అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేస్తున్నారు.

  • 30 Oct 2021 12:11 PM (IST)

    Huzurabad: ఈటెల రాజేందర్‌పై ఈసీకి ఫిర్యాదు

    బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కమలపూర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించడంపై టిఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పలు ఆరోపణలు చేశారు.

  • 30 Oct 2021 12:08 PM (IST)

    Huzurabad: అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్..

    హుజూరాబాద్ ప్రజలు మార్పునకు నాంది పలకాలని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

  • 30 Oct 2021 12:06 PM (IST)

    Huzurabad: హిమ్మత్ నగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు..

    Huzurabad: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. హిమ్మత్ నగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 30 Oct 2021 12:04 PM (IST)

    Badvel: సీఈసీకి ఫిర్యాదు చేసిన ఎంపీ జీవీఎల్‌

    బద్వేల్ ఉపఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని.. ఎంపీ జీవీఎల్‌ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బయటి వ్యక్తులు ఓటు వేసేందుకు వస్తున్నారని జీవీఎల్‌ నరసింహారావు సీఈసీకి ఫిర్యాదు చేశారు

  • 30 Oct 2021 11:43 AM (IST)

    Huzurabad: జమ్మికుంటలో టీఆర్ఎస్ – బీజేపీ శ్రేణుల బాహాబాహీ

    Huzurabad: జమ్మికుంటలో టీఆర్ఎస్ – బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 30 Oct 2021 11:42 AM (IST)

    Huzurabad: చల్లూరులో ఉద్రిక్తత

    వీణవంక మండలం చల్లూరులో బీజేపీ కార్యకర్తల ఆందోళన. మార్కెట్ చైర్మన్ ఇంట్లో డబ్బులు పంచుతున్నారంటూ ధర్నాకు దిగారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది.

  • 30 Oct 2021 11:20 AM (IST)

    Badvel: దొంగ ఓట్లపై ఫిర్యాదులు అందలేదు: సీఈఓ కె విజయానంద్

    బద్వేల్ ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా సీఈఓ విజయానంద్ పర్యవేక్షణ బద్వేల్ ఉప ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ బద్వేల్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదు 3 చోట్ల మాక్ పోలింగ్‌లో ఈవీఎంలల్లో సమస్య వచ్చింది వాటిని అప్పుడే పరిష్కరించాం ఎక్కడ పోలింగ్ ఆగలేదు బస్సుల్లో దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధం ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులు మాకు అందలేదని సీఈఓ కె విజయానంద్ పేర్కొన్నారు.

  • 30 Oct 2021 11:17 AM (IST)

    Badvel: బద్వేల్‌లో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీ లేదు.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

    వైసీపీ కార్యకర్తల కంటే పోలీసు ఘోరంగా ఆ పార్టీకి సహకరిస్తున్నారు. నాడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ రకంగా దొంగ ఓట్లు వేశారో.. దాన్నే బద్వేలులో పునరావృతం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని హౌస్ అరెస్టు చేయాలి. దొంగ ఓట్లతో గెలిచేది.. ఓ గెలుపేనా. పోలీసులులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని ఎందుకు అన్ని మండలాల్లో తిరగడానికి పోలీసులు అనుమతిస్తున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

  • 30 Oct 2021 11:09 AM (IST)

    బద్వేల్‌లో 20.89 శాతం ఓటింగ్ నమోదు..

    బద్వేలు ఉపఎన్నికల్లో ఉదయం 11.00గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదు

  • 30 Oct 2021 11:08 AM (IST)

    హుజురాబాద్‌లో జోరుగా పోలింగ్..

    హుజురాబాద్‌లో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది.

  • 30 Oct 2021 10:51 AM (IST)

    Huzurabad: నా ఊరికి నేనెందుకు రాకూడదు.. కౌషిక్ రెడ్డి

    నా ఊరికి నేనెందుకు రాకూడదంటూ కౌషిక్ రెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని.. తన ఊరికి తానొస్తే బీజేపీ హడావుడి ఎంటని ప్రశ్నించారు.

  • 30 Oct 2021 10:45 AM (IST)

    Badvel: ఎస్ వెంకటాపురంలో ఉద్రిక్తత..

    బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో.. బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి ప్రయత్నం..

    వీడియో..

  • 30 Oct 2021 10:36 AM (IST)

    పోలీసుల విజ్నప్తితో వెనుదిరిగిన కౌషిక్ రెడ్డి

    ఘన్ముక్ల పోలింగ్ కేంద్రానికి కౌషిక్ రెడ్డి చేరుకోవడంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లాలంటూ ఘన్ముక్ల గ్రామస్థులు, బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసుల విజ్నప్తితో కౌషిక్ రెడ్డి వెనుదిరిగారు. మళ్లీ వస్తానంటూ కార్యకర్తలకు చెప్పి వెనుదిరిగారు.

  • 30 Oct 2021 10:33 AM (IST)

    Badvel: అట్లూరు మండలంలో దొంగ ఓట్ల గొడవ

    బద్వేల్ నియోజకర్గం అట్లూరు మండలంలో దొంగ ఓట్ల గొడవ నెలకొంది. ఫేక్ ఐడీలతో ఓట్లు వేయడానికి వచ్చారని మహిళలను అడ్డుకున్న పోలీసులు. ఎస్ వెంకటాపురంలో సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో వెనక్కి పంపించిన పోలీసులు. గోపవరం మండలం బేతాయపల్లిలోని 261 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చి సొమ్మసిల్లి పడిపోయిన చంద్రకళ అనే గర్భవతి.

  • 30 Oct 2021 10:29 AM (IST)

    నాకు అధికారం ఉంది: కౌషిక్ రెడ్డి

    ఎలక్షన్స్ చీఫ్ ఎజెంట్‌గా తనకు పోలింగ్ కేంద్రంలో ఉండే అధికారం ఉందని టీఆర్ఎస్ నాయకుడు కౌషిక్ రెడ్డి పేర్కొన్నారు. కావాలనే కొందరు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.

  • 30 Oct 2021 10:23 AM (IST)

    ఘన్ముక్లలో ఉద్రిక్తత..

    ఘన్ముక్లలో ఉద్రిక్తత.. మళ్లీ పోలింగ్ కేంద్రానికి కౌషిక్ రెడ్డి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ నేతలు, గ్రామస్థులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డి కేంద్రానికి రావొద్దంటూ నినాదాలు చేశారు.

  • 30 Oct 2021 10:21 AM (IST)

    Badvel: మేకలవారిపల్లిలో బీజేపీ ఏజెంట్‌పై దాడి

    బద్వేల్ నియోజకర్గంలో మేకలవారిపల్లిలో బీజేపీ ఏజెంట్‌పై దాడి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తోసేశారని బీజేపీ నేతల ఆరోపణ బీజేపీ నేత పార్థసారధి ఫిర్యాదు

  • 30 Oct 2021 10:11 AM (IST)

    ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోంది: ఈటల రాజేందర్

    అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోందని.. డబ్బులు ఇవ్వలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు. ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోందంటూ ఈటల తెలిపారు. మంచి చెడు ఆలోచించుకునే సత్తా ప్రజలకు ఉందంటూ ఈటల తెలిపారు.

  • 30 Oct 2021 10:04 AM (IST)

    Badvel: బద్వేల్ నియోజకర్గంలో 14.9 శాతం ఓటింగ్

    బద్వేల్ నియోజకర్గంలో ఉదయం 10 గంటల వరకు 14.9 శాతం ఓటింగ్ నమోదైంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఓటు వేసేందుకు బారులు తీరారు.

  • 30 Oct 2021 10:04 AM (IST)

    Huzurabad: హుజూరాబాద్‌ నియోజకర్గంలో 15 శాతం ఓటింగ్

    హుజూరాబాద్‌ నియోజకర్గంలో ఉదయం 10 గంటల వరకు 15 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 30 Oct 2021 09:55 AM (IST)

    Huzurabad: తప్పుడు ప్రచారం చేస్తున్న ముగ్గురి అరెస్ట్: సీపీ సత్యనారాయణ

    కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని కరీంనగర్ సీపీ సత్యనారాయణ ప్రజలకు సూచించారు. అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మీడియా పేరుతో పేపర్ క్లిప్పింగ్లు, వీడియోలు రావొచ్చని.. వాటిని నమ్మొద్దన్నారు. ఇప్పటికే పోలీసుల ద‌ృష్టి మరల్చేందుకు అసత్య ప్రచారం చేస్తు్న్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సత్యనారాయణ తెలిపారు. డబ్బులు పంచుతున్న 139 మందిపై ఇప్పటివరకు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

  • 30 Oct 2021 09:50 AM (IST)

    Huzurabad: కౌషిక్ రెడ్డిని అడ్డుకున్న ఘన్ముక్ల గ్రామస్థులు..

    టీఆర్ఎస్ నేత కౌషిక్ రెడ్డిని ఘన్ముక్ల గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలో కౌషిక్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాలు ఘర్షకు దిగాయి.

  • 30 Oct 2021 09:42 AM (IST)

    Badvel: కేంద్ర బలగాలు కనిపించడం లేదు .. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్

    బద్వేల్ నియోజకర్గంలోని పలు గ్రామాల్లో కేంద్రబలగాలు లేకుండా పోలింగ్ జరగుతుందని.. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ పేర్కొ్న్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. 149, 150 పోలింగ్ స్టేషన్ల వద్ద స్థానిక ఎస్ఐ వైసీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. బయట ప్రాంతానికి చెందిన వందలాది మంది నిన్న రాత్రే బద్వేల్ నియోజకవర్గం చేరుకున్నారు. పోలీసుల తీరు చూస్తుంటే వాళ్లే దగ్గరుండి రిగ్గింగ్ చేయించాలా ఉందని.. బీజేపీ అభ్యర్థి పడవల సురేష్ పేర్కొన్నారు.

  • 30 Oct 2021 09:37 AM (IST)

    జమ్మికుంట, కోరుగర్లు గ్రామాల్లో ఉద్రిక్తత

    జమ్మికుంట, కోరుగర్లు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

  • 30 Oct 2021 09:34 AM (IST)

    Badvel: బద్వేల్ నియోజకర్గంలో 10.49 శాతం ఓటింగ్

    బద్వేల్ నియోజకర్గంలో ఉదయం 9గంటల వరకు 10.49 శాతం ఓటింగ్ నమోదైంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఓటు వేసేందుకు బారులు తీరారు.

  • 30 Oct 2021 09:31 AM (IST)

    Huzurabad: ఓటు వేసిన ఈటల రాజేందర్

    హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో ఈటల రాజేందర్ దంపతులు ఓటు వేశారు.

  • 30 Oct 2021 09:27 AM (IST)

    టీఆర్ఎస్ – బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

    వీణవంక మండలం కోర్కెల్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ – బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

  • 30 Oct 2021 09:26 AM (IST)

    Huzurabad: వీణవంక మండలంలో టెన్షన్.. టెన్షన్

    వీణవంక మండలం కోర్కెల్ పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ – బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

  • 30 Oct 2021 09:22 AM (IST)

    Huzurabad: ప్రశాంతంగా పోలింగ్: కరీంనగర్ కలెక్టర్ కర్ణన్

    9 గంటల వరకు 10.5 శాతం పోలింగ్ జరిగిందని కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ పేర్కొన్నారు. 6 చోట్ల ఈవీఎంలల్లో సాంకేతిక లోపం తలెత్తింది. రెక్టీఫై చేసి పోలింగ్ ప్రారంభించాం. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఔటర్స్ ఉన్నారని రెండు కంప్లైంట్స్ వచ్చాయి. కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీల నుంచి చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చాయి. వంద మీటర్ల లోపు ప్రచారం చేయడానికి వీలు లేదు

  • 30 Oct 2021 09:19 AM (IST)

    Badvel: దొంగ ఓటు వేయడానికి వచ్చిన మహిళలు

    బద్వేలు ఉప ఎన్నికల్లో అట్లూరు మండలంలో దొంగ ఓటు వేయడానికి వచ్చిన మహిళలు సరైన ఐడి కార్డులు లేవని వెనక్కి పంపించిన పోలీసులు

  • 30 Oct 2021 09:18 AM (IST)

    Badvel: విధుల నుంచి ఎస్సై తొలగింపు..

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రశేఖర్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించిన అధికారులు.

  • 30 Oct 2021 09:14 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శాతం ఎంతంటే.?

    హుజురాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీ బందోబస్తు మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఉదయం 9 గంటల వరకు హుజురాబాద్‌లో 10.50 శాతం ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది.

  • 30 Oct 2021 09:14 AM (IST)

    హుజురాబాద్ చేరుకున్న ఎన్నికల అధికారి..

    పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ హుజురాబాద్ చేరుకున్నారు. హుజురాబాద్ నుంచి.. 5 మండలాల్లో బై పోలింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు.

  • 30 Oct 2021 09:13 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి కమలమ్మ

    కాంగ్రెస్ అభ్యర్ధి కమలమ్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”తిరుపతి ఉప ఎన్నికల మాదిరిగానే బద్వేల్‌లో కూడా బయట వ్యక్తులు వచ్చి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చూసుకోవాలని కోరారు.

  • 30 Oct 2021 09:13 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ నేత ఈటెల రాజేందర్ దంపతులు..

    కమలాపూర్ మండల కేంద్రంలోని 262 పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును బీజేపీ ఈటెల రాజేందర్, ఆయన సతీమణి జమున వినియోగించుకున్నారు.

  • 30 Oct 2021 08:45 AM (IST)

    Badvel: బద్వేల్ చింతలచేరువులో ఉద్రిక్తత

    బద్వేల్ చింతలచేరువులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బయటి వ్యక్తులు బీజేపీ ఏజెంట్లు ఎలాఉంటారంటూ.. వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఏజెంట్లను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

  • 30 Oct 2021 08:30 AM (IST)

    Huzurabad: ఇల్లందకుంటలో ఓటర్ల పడిగాపులు..

    ఇల్లందకుంటలో ఓటర్ల పడిగాపులు..

    ఈవీఎంలు మోరాయించడంతో ఓటర్లు గంటకుపైగా క్యూలైన్లో నిలబడి ఉన్నారు.

  • 30 Oct 2021 08:21 AM (IST)

    Badvel: బద్వేల్‌లో తొలిగంటలో 9.5 శాతం ఓటింగ్

    బద్వేల్‌లో తొలిగంటలో 9.5 శాతం ఓటింగ్ నమోదైంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు 9.5 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 30 Oct 2021 08:20 AM (IST)

    Huzurabad: తొలిగంటలో 7.5 శాతం ఓటింగ్

    Huzurabad: తొలిగంటలో 7.5 శాతం ఓటింగ్ హుజూరాబాద్‌లో తొలిగంటలో 7.5 శాతం ఓటింగ్ నమోదైంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు 7.5 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • 30 Oct 2021 08:00 AM (IST)

    Badvel: ఓటు హక్కు వినియోగించుకు బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ

    బద్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    పోరుమామిళ్ళ రంగసముద్రం పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.

  • 30 Oct 2021 07:56 AM (IST)

    రంగ సముద్రంలో అరగంట ఆలస్యంగా పోలింగ్

    పోరుమామిళ్ళ రంగ సముద్రంలో అరగంట ఆలస్యంగా పోలింగ్

    77A బూత్ లో 20 నిమిషాలు ఆలస్యంగా అనుమతించిన అధికారులు

    7గంటలకే ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు

  • 30 Oct 2021 07:49 AM (IST)

    హుజూరాబాద్ పోలింగ్ పై ఈసీ డేగ కన్ను

    హుజూరాబాద్ పోలింగ్ పై ఈసీ డేగ కన్ను

    హైదరాబాద్ ఈసీ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

    306 పోలింగ్ స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్ ద్వారా మోనటరింగ్

    ప్రతీ పోలింగ్ బూత్ ను ఈసీ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు

    127 సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టిన ఈసీ

  • 30 Oct 2021 07:48 AM (IST)

    హుజూరాబాద్ ఎన్నికపై ఈసీ డేగ కన్ను..

    హుజూరాబాద్ ఎన్నికపై ఈసీ డేగ కన్ను..

    127 సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది.

  • 30 Oct 2021 07:42 AM (IST)

    పోరుమామిళ్లలో నిలిచిన పోలింగ్

    బద్వేల్ నియోజవర్గంలోని పోరుమామిళ్లలో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు మోరాయించడంతో ఓటర్లు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు.

  • 30 Oct 2021 07:37 AM (IST)

    వెబ్‌కాస్టింగ్‌ మధ్య పోలింగ్

    ఎన్నికల అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగుతోంది.

  • 30 Oct 2021 07:33 AM (IST)

    కొనసాగుతున్న ఉప ఎన్నికల దంగల్

    హుజూరాబాద్, బద్వేల్ లో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

  • 30 Oct 2021 07:30 AM (IST)

    ఇల్లంతకుంటలో నిలిచిన పోలింగ్

    ఇల్లంతకుంట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మోరాయించాయి. దీంతో 224 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రారంభంకాలేదు.

  • 30 Oct 2021 07:29 AM (IST)

    మోరాయించిన ఈవీఎలు

    ఇల్లంతకుంట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మోరాయించాయి. దీంతో అక్కడ పోలింగ్ ప్రారంభంకాలేదు

  • 30 Oct 2021 07:19 AM (IST)

    టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ

    హుజూరాబాద్‌లో ప్రధానంగా అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా గట్టి పోటినిస్తుంది.

    అభ్యర్థుల వివరాలు..

    టీఆర్ఎస్: గెల్లు శ్రీనివాస్ యాదవ్

    బీజేపీ: ఈటల రాజేందర్

    కాంగ్రెస్: బల్మూర్ వెంకట్

  • 30 Oct 2021 07:16 AM (IST)

    మెడికల్ క్యాంపులు ఏర్పాటు

    కోవిడ్ నిబంధనలతో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రతి కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

  • 30 Oct 2021 07:12 AM (IST)

    మాస్క్ ఉంటేనే అనుమతి..

    ఓటర్లకు మాస్క్ ఉంటేనే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి అనుమతిస్తున్నారు. లేకపోతే వెనుకకు పంపిస్తున్నారు.

  • 30 Oct 2021 07:08 AM (IST)

    బారులు తీరిన ఓటర్లు

    హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆ నియోజకవర్గాల్లోని ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

  • 30 Oct 2021 07:06 AM (IST)

    బద్వేల్ పోటీలో 15 మంది అభ్యర్థులు..

    బద్వేల్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. అధికార వైసీపీ, బీజేపీ పార్టీ మధ్య పోరు నెలకొంది

  • 30 Oct 2021 07:05 AM (IST)

    హుజూరాబాద్ పోటీలో 30 మంది అభ్యర్థులు..

    హుజూరాబాద్ నియోజవర్గంలో.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • 30 Oct 2021 07:02 AM (IST)

    పోలింగ్ ప్రారంభం..

    హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు.

  • 30 Oct 2021 07:01 AM (IST)

    పకడ్భందీగా.. ఏర్పాట్లు

    హుజూరాబాద్‌లో ఎన్నికల అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీసులను మోహరించారు. మొత్తం 3,865 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. బందోబస్తులో 20 కంపెనీల కేంద్ర బలగాలు, 74 మంది ప్రత్యేక పోలీసులు700 మంది కరీంనగర్‌ జిల్లా పోలీసులు, 1,471 మంది ఇతర జిల్లాల పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

  • 30 Oct 2021 06:40 AM (IST)

    బద్వేల్ నియోజకవర్గంలో..

    బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 22 మంది ఉన్నారు.

  • 30 Oct 2021 06:38 AM (IST)

    హుజూరాబాద్‌లో మండలాల వారిగా ఓటర్లు..

    హుజూరాబాద్‌లో మండలాల వారిగా ఓటర్లు..

    హుజూరాబాద్ 61 వేయి 673 ఇల్లంతకుంట 24 వేల 799 జమ్మికుంట 59వేల20 వీణవంక 40 వేల 99 కమలపూర్ 51 వేల 282

  • 30 Oct 2021 06:37 AM (IST)

    హుజూరాబాద్ పోలింగ్ స్టేషన్స్.. ఇలా

    హుజూరాబాద్ నియోజవర్గంలో 306 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 127 సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలు 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లు మహిళ ఓటర్లు: లక్షా 19 వేల 102 పురుషులు: లక్షా 17 వేల 933

Published On - Oct 30,2021 6:25 AM

Follow us