Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2021 Special: దీపావళి స్పెషల్.. ఇంట్లోనే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ..

Diwali Special Sweet Dry Fruits Laddu: హిందువుల పండగ అంటేనే సంబరాలు, సందడి.. దీపావళి అంటే వేరేవేరీ స్పెషల్. కొన్ని రోజులకు ముందుగానే..

Diwali 2021 Special: దీపావళి స్పెషల్.. ఇంట్లోనే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ..
Dry Fruits Laddu
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2021 | 12:01 PM

Diwali Special Sweet Dry Fruits Laddu: హిందువుల పండగ అంటేనే సంబరాలు, సందడి.. దీపావళి అంటే వేరేవేరీ స్పెషల్. కొన్ని రోజులకు ముందుగానే దీపావళి పండగ సంబరాలు మొదలవుతాయి. దీపాలు, బాణాసంచా, స్వీట్స్, లక్ష్మి పూజ ఇవన్నీ దీపావళిని ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇక దీపావళికి స్నేహితులకు,  కుంటుంబ సభ్యులకు స్వీట్స్ ను ఇచ్చి శుభాకాంక్షలు చెబుతారు. దీంతో సీట్స్ షాప్స్ అన్నీ దీపావళి ముందురోజునుంచి రద్దీతో నిండిపోతాయి. అయితే మనం కొంచెం ఇష్టంగా కష్టపడితే.. స్వీట్స్ షాప్స్ లో దొరికే స్వీట్స్ ను ఇంట్లోనే అంతే టెస్టుగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం ఇంట్లో ఈజీగా టేస్టీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు: 

గింజలు లేని ఖర్జురం  – అర కిలో జీడిపప్పు  – అర కేజీ గసగసాలు – 50 గ్రాములు అంజీర్  – 100 గ్రాములు బాదంపప్పు  – 100 గ్రాములు సారపప్పు – 100 గ్రాములు ఎండుకొబ్బరి – 50 గ్రాములు పిస్తాపప్పు  – 100 గ్రాములు బెల్లం – 150 గ్రాములు చక్కెర – 100 గ్రాములు నెయ్యి – లడ్డు చుట్టుకోవడానికి సరిపడినంత యాలకుల పొడి- ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం: ఈ లడ్డు తయారీ కోసం గింజలు ఉన్న ఖర్జురం తీసుకుంటే.. వాటి నుంచి గింజలను వేరు చేసి.. నిలువుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. బాదం, సారపప్పు, పిస్తా పప్పు ను కూడా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక అంజీరా ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అనంతరం ఒక  దళసరి గిన్నె తీసుకుని అరలీటరు నీరు వేసుకుని.. దానిలో బెల్లం. పంచదార వేసి.. ఆ గిన్నెను స్టౌ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ ని వెలిగించి స్విమ్ లో పెట్టి.. తీగ పాకం వచ్చేలా బెల్లం పాకం తయారు చేసుకోవాలి.  తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి.. కొంచెం నెయ్యి వేసుకుని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఖర్జురం , బాదం, సారపప్పు, పిస్తా పప్పు, అంజీరాని వేయించుకోవాలి. అనంతరం అందులో  గసగసాలు , యాలకుల పొడి వేసి.. కొంచెం సేపు వేయించుకుని.. స్టౌ మీద నుంచి బాణలిని దింపేసుకోవాలి.  తర్వాత ముందుగా రెడీ చేసుకున్న తీగ పాకంలో ఈ డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసుకుని కొంచెం సేపు బాగా మిక్స్ చేయాలి. అనంతరం కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని గుండ్రంగా లడ్డుల్లా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డులు రెడీ.. దీపావళికి ఆత్మీయులకు స్వయంగా ఇంట్లో తయారు చేసిన రుచికరమైన డ్రైఫ్రూట్స్ లడ్డులను కానుకగా ఇవ్వండి.. ఈ లడ్డులు ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి.

Also Read:  సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత.. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక